మంత్రి పదవులపై జగన్ కొత్త ప్లాన్ ? ఇలా అయితే వారికి ఇబ్బందే

ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.ఇంకా ఎన్నికల ఫలితాలు రాలేదు కానీ అప్పుడు తమకు మంత్రి పదవి కావాలంటే తమకు మంత్రి పదవి కావాలంటూ ఆశావాహులు జగన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ తమకు ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Jagan New Plans On-TeluguStop.com

ఈసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమే అన్న ధీమా కూడా వారిలో బాగా కనిపిస్తోంది.అందుకే ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు వదలకుండా చేస్తున్నారు.

అలాగే జగన్ ముఖ్య మంత్రి అయితే కేబినెట్ కూర్పు ఎలా ఉంటుంది ? ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి? అనే అంశాలపై కొన్ని రోజులుగా చర్చ కూడా జోరుగా సాగుతోంది.

అయితే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే అంశంలో జగన్ ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు అలాగని ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వలేదు.

దీనికి కారణం ఎన్నికల ఫలితాలు రాకముందే కేబినెట్ పోస్టులపై చర్చించడం సరికాదన్న ఆలోచనలో జగన్ ఉండడమే కారణం అని తెలుస్తోంది.మే 23న ఫలితాలు వెలువడిన తర్వాతే చర్చిద్దామన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దాంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలునిరాశ చెందుతున్నారట.ఈ సందడి ఇలా ఉండగానే జగన్ ఆలోచన మాత్రం వేరేగా ఉందట.

కేబినెట్ ఏర్పాటైన తర్వాత మంత్రి పదవులు దక్కని వారిలో అసంతృప్తి ఉంటుందని, అది పార్టీకి మంచిది కాదని ఆయన భావిస్తున్నారు.

అందుకే సరికొత్త రీతిలో మంత్రి మండలి కూర్పు చేయాలని చూస్తున్నారు.

ఏపీలో సీఎంను కలుపుకొని మొత్తం 26 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.సీఎంగా జగన్‌ను తప్పిస్తే.

మంత్రివర్గంలో మరో 25 మందికి అవకాశం ఉంటుంది.ఇక ఏపీలోని లోక్‌సభ స్థానాల సంఖ్య కూడా 25 కావడంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రి పదవి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకునేందుకు జగన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దీనిపై ఇప్పటికే జగన్ తన సన్నిహితులతో పలు దఫాలుగా ఈ విషయపై చర్చించినట్టు సమాచారం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube