రెడీ టూ ఓపెనింగ్ : అమరావతిలో జగన్ ఇల్లు రెడీ  

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. దీనికి తగ్గట్టుగానే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల అధినేతలు ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ… ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అమరావతి నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కరకట్ట మీద ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు, జనసేన పార్టీలు అమరావతి నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేయగా… ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కూడా ఆ విధంగానే ఇప్పుడు అమరావతికి మకాం మార్చేయబోతున్నాడు.

Jagan New House Ready To Opening-

Jagan New House Ready To Opening

ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి సమీపంలోని తాడేపల్లిలో జగన్ నూతన గృహ ప్రవేశం చేస్తారు. అదే రోజు నూతన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, లోక్‌సభ సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓ లేఖ రాశారు.