ఆ వైసీపీ సీనియ‌ర్‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌ట్లేదా... ?ఫ్యూచ‌ర్ నిల్‌...!  

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డుతుందో ఎవ‌రూ చెప్పలేరు.ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అను కూలంగా మార్చుకున్న నాయ‌కులు చ‌రిత్ర సృష్టించారు.

TeluguStop.com - Jagan Neglecting Senior Ycp Leader

కానీ, ప‌రిస్తితుల‌కు లొంగిపోయిన నాయ‌కులు అదే చ‌రిత్ర‌లో క‌లిసిపోయారు.ఇప్పుడు ఈ రెండోర‌కం రాజ‌కీయ నేత‌గా క‌నిపిస్తున్నార‌ట‌.

కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ఈయ‌న మార‌ని పార్టీ లేదు.

TeluguStop.com - ఆ వైసీపీ సీనియ‌ర్‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌ట్లేదా… ఫ్యూచ‌ర్ నిల్‌…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎప్పుడు ఏ పార్టీ తెర‌మీదికి వ‌స్తే.ఆ పార్టీ పంచ‌న చేర‌డం ఈయ‌న‌కు రాజ‌కీయంగా అబ్బిన విద్య‌గా ఇక్క‌డ ప్ర‌చారంలో ఉంది.

ఇదే ఆయ‌న‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామంగామారి .రాజ‌కీయ ఉనికిని లేకుండా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
గతంలో చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన సుబ్బారాయుడుకు త‌న సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది.ఇదే ఆయ‌న అన్ని పార్టీలు మారేందుకు దోహ‌ద‌ప‌డింద‌నే ప్ర‌చారం ఉంది. 1981లో ఇండిపెండెంట్‌గా నరసాపురం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలిచిన సుబ్బారాయుడు.తర్వాత టీడీపీలో చేరి 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.1994లో రెండోసారి గెలిచిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు.చంద్రబాబు కేబినెట్‌లోనూ పనిచేశారు.

మధ్యలో ఒకసారి నరసాపురం ఎంపీగానూ ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజకీయంగా స్టెప్ మార్చారు.త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన చిరంజీవి పార్టీ పెట్టేస‌రికి 2009లో పీఆర్పీలో చేరిపోయారు.ఈ క్ర‌మంలోనే నరసాపురం నుంచి పోటీ చేసినా ఆయ‌న సామాజిక వ‌ర్గ‌మే ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టింది.

దీంతో గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు.ఆ త‌ర్వాత‌.

పార్టీ మారి.(పీఆర్‌పీ విలీనం) కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.2011లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు కొత్తపల్లి.ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చ‌కోర ప‌క్షి మాదిరిగా త‌న దూకుడు కోసం ఎదురు చూస్తున్నారు.

2014లో వైపీపీ నుంచి పోటీ చేసినా  గెలవలేకపోయారు.ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో.వైసీపీకి గుడ్‌బై చెప్పి చంద్రబాబుకు జైకొట్టారాయన.ఈ క్ర‌మంలో అత్యంత కీల‌క‌మైన‌ కాపు కార్పొరేషన్‌ చైర్మన్ ప‌ద‌విని ఇచ్చారు చంద్ర‌బాబు.కానీ, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న టికెట్ ఆశించారు.అయితే.

చంద్ర‌బాబు అన్ని స‌మీక‌ర‌ణ‌లు తెలుసుకుని ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు.దీంతో అలిగి.

న‌ర‌సాపురం ప్ర‌స్తుత ఎంపీ.ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సూచ‌న‌ల‌తో వైసీపీకి మ‌ద్దతుదారుగా మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చారు.

ఆయ‌న గెలుపున‌కు కృషి చేశారు.మ‌ళ్లీ సీన్ రివ‌ర్స్‌! ఇప్పుడు ఆయ‌న‌కు వైసీపీలో ప్రాధాన్యం లేకుండా పోయింది.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్ప‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మొత్తంగా చూస్తే.

కొత్త ప‌ల్లి రాజ‌కీయాల‌కు ఎండ్‌కార్డ్ ప‌డింద‌నే చెబుతున్నారు.

#AP Cm #Chandra Babu #Ysrcp #Jagan #West Godavari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Neglecting Senior Ycp Leader Related Telugu News,Photos/Pics,Images..