ఇంత చేత‌గాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడ‌దని అంటున్న లోకేష్..!

ప్రస్తుత రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం దొరికితే వారు తెలంగాణకు ఎందుకు వెళతారని తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇంత చేతగాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉండకూడదని తెలియజేశారు.

 Jagan Nara Lokesh Sensational Commensts Ap Cm-TeluguStop.com

అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంబులెన్స్ లను తెలంగాణ పోలీసులు ఆపివేయడంతో వారిని మానవతా దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి పేషెంట్ల అంబులెన్సులను రాష్ట్రంలోకి అనుమతించాలని ఆయన ఆకాంక్షించారు.

కేవలం ఆరోగ్య పరిస్థితి చేజారి పోయే వారు మాత్రమే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి వస్తున్నారని.వారికి సరైన సమయంలో ఆసుపత్రిలో చేరితేనే ప్రాణాలు నిలబడతాయని.అది తెలంగాణ ప్రభుత్వం గ్రహించాలని ఆయన చెప్పుకొచ్చారు.

 Jagan Nara Lokesh Sensational Commensts Ap Cm-ఇంత చేత‌గాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడ‌దని అంటున్న లోకేష్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో విరుచుక పడ్డారు.

ఇందులో భాగంగానే ప్రజలు ఇక్కడ ఉంటే ప్రాణాలు నిలవక పోగా.

ఒకవేళ ఆరోగ్యం కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని., అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు, అలాగే మంత్రులకు కరోనా వైరస్ సోకిన వారు మాత్రం ఆగమేఘాలపై హైదరాబాద్ మహానగరానికి వెళ్లి మరి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటానని తెలియజేశాడు.

అలాంటి వారు వారి ప్రజల్ని హైదరాబాద్ పంపే అవకాశం ఇప్పించలేరా అంటూ ప్రశ్నించాడు.తాడేపల్లి ఇంట్లో ఎన్ని గంటలు నిద్ర పోతారని.

, లేచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి అనుమతులు ఇప్పించుకావాలని అంటూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై నారా లోకేష్ ధ్వజమెత్తాడు.

#Nara Lokesh #AP Cm #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు