కోడి కత్తి కేసు : కోర్టుకు వెళ్లిన ఎన్ఐఏ     2019-01-08   19:19:22  IST  Sai Mallula

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మీద కోడి కత్తితో జరిగిన దాడి వ్యవహారం తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు అనేక మలుపులు.. ట్విస్ట్ ల మధ్య కోర్టు పరిధిలోకి వెళ్లడం.. కోర్టు ఎన్ ఐ ఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. అయితే ఈ కేసులో ఎన్ఐ ఏ కు సహకరించకుండా…. ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ జాతీయ సంస్థ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.

Jagan Murder Atempt Case Nia Pition On Court-

Jagan Murder Atempt Case Nia Pition On Court

ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్పించాలని ఎన్‌ఐఏ కోర్టులో మెమో దాఖలు చేసింది. అలాగే ఈ కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని కోరింది. నిందితుడు శ్రీనివాసరావును కూడా కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాల మధ్య ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో… కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.