ఏపీలో కొత్త జిల్లాలకు ముహూర్తం ఖరారు  

Jagan Mohan Reddy Plan To Established Some More Distict In Andhrapradesh-jagan,jagan Meeting With New Disticts In Andhrapradesh,kcr,new Distict Announce In January 26,telangana

ప్రత్యేక రాష్ట్రం అయిన వెంటనే తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.ప్రస్తుతం రాష్ట్రం కొత్త జిల్లాల ప్రాతిపధికనే పరిపాలన కొనసాగిస్తున్న విషయం తెల్సిందే.అయితే ఏపీలో మాత్రం కొత్త జిల్లాల విషయం గత కొన్ని సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది...

Jagan Mohan Reddy Plan To Established Some More Distict In Andhrapradesh-jagan,jagan Meeting With New Disticts In Andhrapradesh,kcr,new Distict Announce In January 26,telangana-Jagan Mohan Reddy Plan To Established Some More Distict In Andhrapradesh-Jagan Jagan Meeting With New Disticts Andhrapradesh Kcr New Announce January 26 Telangana

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనే కొత్త జిల్లాలను చేయాలని భావించారు.కాని కొన్ని కారణాల వల్ల అప్పుడు సాధ్యం కాలేదు.ఇప్పుడు మళ్లీ జగన్‌ హయాంలో కొత్త జిల్లాల గురించిన చర్చ మొదలైంది.

కొత్తగా పది జిల్లాలను పెంచాలనే ఉద్దేశ్యంతో జగన్‌ అండ్‌ కో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Jagan Mohan Reddy Plan To Established Some More Distict In Andhrapradesh-jagan,jagan Meeting With New Disticts In Andhrapradesh,kcr,new Distict Announce In January 26,telangana-Jagan Mohan Reddy Plan To Established Some More Distict In Andhrapradesh-Jagan Jagan Meeting With New Disticts Andhrapradesh Kcr New Announce January 26 Telangana

ఏపీలో ఉన్న పార్లమెంటు స్థానాలన్నీ జిల్లాలుగా ప్రకటించాలని మొదట భావించారు.ఆ తర్వాత నిర్ణయంలో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది.

జగన్‌ సీఎం అయ్యి 100 రోజులు అయిన సందర్బంగా నిర్వహించిన ఒక సమీక్ష సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించిన చర్చ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.కొత్త జిల్లాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, ఆ విషయమై తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అధికారులతో జగన్‌ చెప్పాడట.ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర భూ సర్వే తర్వాత కొత్త జిల్లాల పక్రియ ప్రారంభం కాబోతుంది.కొత్త జిల్లాలను వచ్చే ఏడాది రాబోతున్న రిపబ్లిక్‌ డే సందర్బంగా అంటే జనవరి 26, 2020లో ఏర్పాటు చేయబోతున్నారు.ఆ రోజు నుండే కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కాబోతుంది.