రోజా కు మంత్రి పదవి ? జగన్ ఆలోచన ఇదేనా ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుని, గత టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ అసెంబ్లీలోనూ, బయట, చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ను టార్గెట్ గా చేసుకుంటూ విమర్శల బాణాలు వదులుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోజా.అప్పటి టిడిపి ప్రభుత్వంలో నగరి నుంచి వైసీపీ తరఫున శాసనసభ్యురాలిగా గెలిచిన రోజా నిత్యం ప్రజా పోరాటాలు చేస్తూ వైసీపీకి బలమైన వాయిస్ గా ఉండేవారు.

 Jagan Mohan Reddy Thinking About Roja Give The Minister Post-TeluguStop.com

రోజా మైకు పట్టుకుంటే చాలు టిడిపి నాయకుల్లో వణుకు మొదలయ్యేది అంటే ఆమె ఏ రేంజ్ లో విరుచుకుపడేవారో జనాలకు తెలియంది కాదు.అలా ఆమె జగన్ కు అత్యంత సన్నిహితురాలిగా మారిపోయారు.

Telugu Apcm, Ap Legistlave, Jaganmohan, Pillisubash, Ycp Roja-Political

జగన్ కూడా అంతే స్థాయిలో ఆమెకు గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండేవారు.ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడం నగరి నుంచి మళ్ళీ రోజా ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మంత్రివర్గ విస్తరణ ఆమెకు కీలకమైన మంత్రి పదవి దక్కుతుందని అంతా అంచనా వేశారు.అయితే అనూహ్యంగా జగన్ వివిధ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ రోజాకు మొండిచేయి చూపారు.దీంతో కొద్ది రోజుల పాటు ఆమె అసంతృప్తితో ఉన్నట్టు కనిపించారు.కానీ ఆమె ప్రాధాన్యతను మరిచిపోని జగన్ ఆమెకు అత్యంత కీలకమైన ఏపీఐఐసి చైర్ పర్సన్ గా ఆమెకు పదవి కట్టబెట్టి ఆమె ప్రాధాన్యం తెలియజెప్పారు.అయితే ఆమె మాత్రం మంత్రిపదవి మీదే ఆశలు పెట్టుకున్నారు.

Telugu Apcm, Ap Legistlave, Jaganmohan, Pillisubash, Ycp Roja-Political

అయితే అనూహ్యంగా శాసనమండలి సభ్యత్వం ద్వారా మంత్రి పదవులు చేపట్టిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్ తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయితే తనకు మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ఆశలు పెట్టుకున్నారు రోజా.దీంతోపాటు ఇప్పటికే మంత్రులుగా ఉన్న కొంతమంది పనితీరుపై జగన్ చాలా కాలం నుంచి అసంతృప్తిగా ఉన్నారు.ఈ రెండు మంత్రి పదవులను భర్తీ చేస్తే ఖచ్చితంగా పనితీరు బాగోలేని కొంత మంది మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం కనిపిస్తోంది.

Telugu Apcm, Ap Legistlave, Jaganmohan, Pillisubash, Ycp Roja-Political

ఆ విధంగా చూసినా తనకు మంత్రి పదవి వచ్చితీరుతుందని రోజా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు.అయితే జగన్ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది మాత్రం తెలియడం లేదు.ప్రస్తుతం మంత్రి పదవులు పోగొట్టుకునే ఇద్దరు మంత్రులు బీసీలు కావడంతో మళ్లీ మంత్రులుగా బీసీలకు అవకాశం ఇస్తారా లేక అందులో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజాకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube