అబ్బో ! జగన్ ప్లాన్ అదిరిందిగా

ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే రాజకీయాల్లో పార్టీలకు గాని, నాయకులకు గానీ మనుగడ ఉంటుంది.లేకపోతే వెనకబడి పోతుంటారు.

 Jagan Mohan Reddy Super Plan Applied On Tdp Party Mlas-TeluguStop.com

ఇప్పటి వరకు అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలా ఏపీలో రాజకీయం నడిచింది.అయితే ఇప్పుడు ఆ అవకాశం అధికారపార్టీకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇసుక కొరత పై ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన ప్రత్యర్ధి పార్టీలు ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోవడంతో కొత్త సమస్యను వెతికి దానిద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.ఇక అధికార పార్టీ వైసీపీ తమ రాజకీయ ప్రత్యర్ధులకు ఎక్కడ అ అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

అలాగే ఏపీ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఆ హోదా కూడా దూరం చేయాలనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది.దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని తమ బుట్టలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు.

Telugu Apcm, Chandrababu Tdp, Gannavarammla, Jaganmohan, Ys Jagan Ysrcp-

అయితే నేరుగా వారు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరితే వారిపై అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశ్యంతో పార్టీకి మాత్రమే రాజీనామా చేయించి వైసీపీలో చేరక్కర్లేకుండా జగన్ కొత్త స్కెచ్ వేసాడు.ఇప్పటికే ఈ ఫార్ములాను గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ నుంచి మొదలుపెట్టారు.వంశీతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించారు కానీ ఆయన వైసీపీలో చేరలేదు.అయిదేళ్ళు వైసీపీకి సానుభూతి పరుడిగానే వంశీ ఉండబోతున్నారు.ఇంకా మరో ఏడుగురు ఎమ్మెల్యేలను ఇదే విధంగా టిడిపి నుంచి దూరం చేస్తే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దవుతుంది అని జగన్ భావిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు బిజెపి వైపు చూస్తున్నారు.

వీరందరికీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నాయకత్వం వహిస్తున్నారు.

Telugu Apcm, Chandrababu Tdp, Gannavarammla, Jaganmohan, Ys Jagan Ysrcp-

బిజెపిలోకి వెళ్లే వారిని పక్కన పెడితే మిగతా వారిని టీడీపీకి ఎలా దూరం చేయాలనే ఆలోచన జగన్ లో ఎక్కువగా కనిపిస్తుంది.ముఖ్యంగా బాబు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఆ పార్టీ నుంచి దూరం చేసి వారితోనే బాబుపై విమర్శలు చేయించాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.జగన్ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే టీడీపీ కి ప్రతిపక్ష హోదా దూరం అవ్వడంతో పాటు కోలుకోలేని ఎదురుదెబ్బ చవిచూడాల్సి వస్తుంది.

అయితే జగన్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.ఇక బాబు కూడా వైసీపీలోకి వెళ్తారు అనే అనుమానం ఉన్న ఎమ్యెల్యేలను పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది.తమకు ఉన్న వ్యాపారాలు, బలహీనతలు దృష్ట్యా పార్టీ మారాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందని ఆ సందర్భంగా వారు చెప్పినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube