“జగన్” ప్లాన్ తో ఖంగుతిన్న “పవన్ కళ్యాణ్”   Jagan Mohan Reddy Give Shock To Pawan Kalyan     2018-02-14   03:58:28  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పవన్ జనసేనకి చుక్కలు చూపిస్తోంది..జనసేన అధినేత తీసుకునే ఆలస్యపు నిర్ణయాలకి గాను పవన్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది..ఇనకీ ఏమయ్యింది..జగన్ తీసుకున్ని నిర్ణయం ఏమిటంటే..పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తరువాత “ప్రత్యేకహోదా” ఉద్యమాన్ని బుజాల కెత్తుకుని పోరాటం చేస్తారని భావించారు అందరు..అయితే పవన్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు..సరికదా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మందకొండి తనం పాటించారు..దాంతో ఇప్పుడు ఫ్యాన్స్ కూడా పవన్ పై అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ఇప్పుడు ప్రత్యేకహోదా అనే నినాదం ఫుల్ ఫేమస్ దాంతో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మునుగానే ప్రత్యేకహోదా గోదాపై గళం విప్పారు..మొన్నటికి మొన్న మాట్లడుతూ ఏపీ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చేవారిఒకి మాత్రమే మేము కేంద్రంలో సపోర్ట్ చేస్తామని చెప్పడమే కాకుండా తాజాగా “ఏప్రిల్ 6” న వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారంటూ జగన్ చాలా తెలివిగా ప్రకటించారు…దాంతో ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైసీపినే అని ప్రజలు డిసైడ్ అయ్యారు..ఇప్పుడు జగన్ ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే ప్రత్యేకహోదా కోసం పోరాడేది వైసీపీయే అని..చంద్రబాబు ఏ మాత్రం ఈ విషయంలో ఫైట్ చేయలేకపోయారు..అని చెప్పడం.

అయితే వాస్తవానికి పవన్ ప్రత్యేకహోదా కోసం గట్టిగా డిమాండ్ చేయడంలో వెనకడుగు వేశారు దాంతో జగన్ ఒక్కసారిగా ప్రత్యేకహోదా పై తన స్టాండ్ ప్రకటించి ఏపీ ప్రజల చూపు తనవైపు తిప్పుకున్నారు..పవన్ కూడా ప్రత్యేకహోదా కోసం బస్సు యాత్రలు చేసి ప్రజలలో తిరుగుదాం అని అనుకున్నారు..అయితే పవన్ ప్రకటన చేసేలోగానే జగన్ ప్రకటన చేసి పాదయాత్ర మొదలు పెట్టేశాడు..ఇప్పుడు ప్రత్యేకహోదా విషయంలో కూడా ఇదే జరిగింది..జగన్ మాత్రం నిర్ణయాలు ఎంతో వేగంగా తీసుకుంటూ ముందుకు వెళ్లి సక్సెస్ అవుతూ జనసేనానికి షాక్ ఇస్తున్నాడు..అయితే అసలు పవన్ పార్టీ మనుగడ సాధించాలి అంటే దానికి సంజీవని “ప్రత్యేకహోదా” అంశం అలాంటిది పవన్ ఈ విషయంలో తీసుకున్న లేటు నిర్ణయం ఎలాంటి మార్పులకి కారణం అవుతుందో వేచి చూడాలి.