జగన్ ఆ మరకలు చెరిపెయ్యాలనుకుంటున్నాడా ?  

Jagan Mohan Reddy Focus On Previous Government Corruption-corruption,jagan In Charlapali Jail,jagan Involvement In Tender Notification,jagan Mohan Reddy,తెలుగుదేశం పార్టీ,వైసీపీ అధినేత జగన్

వైసీపీ అధినేత జగన్ పై అనేక నిందలు ఉన్నాయి. జగన్ లక్షకోట్ల దొంగ, జైలుపక్షి, అవినీతిపరుడు అని అయన మీద రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జనాల్లోకి కూడా లక్ష కోట్లు అనే అంశం బాగా వెళ్ళిపోయింది..

జగన్ ఆ మరకలు చెరిపెయ్యాలనుకుంటున్నాడా ?-Jagan Mohan Reddy Focus On Previous Government Corruption

ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజార్టీ సీట్లు వచ్చినా జగన్ మీద నిందలు మాత్రం పోలేదు. అందుకే ఆయన తన పరిపాలనలో పారదర్శకత పెంచి ఆ నిందలు పూర్తిగా అవాస్తవం అని ప్రజల్లోనే చర్చ జరిగేలా చేయాలనుకుంటున్నాడు. అందుకే వైసీపీ ప్రభుత్వం తమ ప్రతి నిర్ణయంలోనూ పారదర్శకత పెంచుకునేలా చూసుకుంటోంది.

అదే సమయంలో అవినీతి వ్యవహారాలకు సంబంధించి కఠినంగా ఉండాలని సీఎం జగన్ ఫిక్స్ అయిపోయారు.

అందుకే సొంత పార్టీ నేతలకు కూడా ఈ విషయంలో గట్టిగానే క్లాస్ పీకుతున్నారట. ఇదే సమయంలో తమను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టిన తెలుగుదేశం పార్టీ మీద కూడా రివెంజ్ తీర్చుకునే పనిలో జగన్ ఉన్నాడు.

దీనిలో భాగంగానే గత ప్రభుత్వం పూర్తి చేసిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి విచారణ చేపట్టాలని జగన్ నిర్ణయించారు. తమ ప్రభుత్వంలో జరిగే ప్రతి టెండర్ నూ హైకోర్టు జడ్జి నేతృత్వంలోని కమిటీ ఆమోద ముద్ర వేసిన తరువాతే ఫైనల్ చేస్తామని గతంలోనే జగన్ ప్రకటించిన విషయం తేలిసిందే. దీనిని బట్టి చూస్తే జగన్ ప్రాజెక్టుల అవినీతిని అరికట్టే విషయంలో ఎంతో స్పష్టతతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇది ఒకరకంగా చెప్పాలంటే సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక వేరే కారణం కూడా కనిపిస్తోంది. సాధారణంగా ఏ టెండరు విషయంలోనైనా అవినీతి ఆరోపణలు రావడం షరా మాములే అయిపొయింది. ఇదంతా సర్వ సాధారణమే అన్నట్టు ప్రజలు కూడా ఇటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోవడం మానేశారు.

కొన్ని కొన్ని నిజాయితీగా చేసినా రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వం ఒక్కోసారి అనవసర నిందలు మోయాల్సి వస్తోంది. కొన్ని వ్యవహారాలు కోర్టు వరకు కూడా వెళ్లి ప్రాజెక్టుల పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. జ్యుడిషియల్ కమిటీ కనుక నియామకమైతే, అన్ని టెండర్లు ఆ కమిటీ దృష్టికి వెళ్లాకే ఆమోదం పొందగలిగితే అది విప్లవాత్మక మార్పునకు నాంది పలికినట్టు అవుతుందనే జగన్ భావిస్తున్నాడు..

తద్వారా వచ్చే క్రెడిట్ తన ఖాతాలో పడుతుందని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీనికితోడు జగన్ పారదర్శకమైన పరిపాలన చేస్తున్నాడు అనే సంకేతం ప్రజల్లో వచ్చి ఇప్పటివరకు తన మీద పడ్డ మరకలు చెరిగిపోయే ఛాన్స్ ఉందని జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది.