జగన్ అలా అనడంతో లబోదిబో అంటున్న ఎమ్మెల్యేలు !  

Jagan Mohan Reddy Comments On Party Leaders-jagan,telugu Desham Party,yscplp Meeting,టీడీపీ,వైసీపీ అధినేత జగన్

వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మొత్తం అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్న జగన్ అదే సమయంలో పార్టీ నాయకుల్లో కూడా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. తొమ్మిదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి అనేక సంక్షోభాలను ఎదుర్కొంది..

జగన్ అలా అనడంతో లబోదిబో అంటున్న ఎమ్మెల్యేలు !-Jagan Mohan Reddy Comments On Party Leaders

ఈ దశలో పార్టీ కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. ఈ సమయంలో పార్టీకోసం ఆర్ధికంగా ఎంతో మంది ఖర్చుపెట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చేసింది.

పార్టీ కోసం కష్టపడ్డ వారంతా ఆనందంలో మునిగిపోయారు. ఇక తమదే రాజ్యం ఇప్పటివరకు ఖర్చుపెట్టింది అంతా రాబట్టుకోవచ్చు అని అంతా అనుకున్నారు. టీడీపీ నాయకుల ఆదాయ మార్గాలు ఏంటో తెలుసుకునే పనిలో మరికొందరు బిజీ అయిపోయారు.

ద్వితీయశ్రేణి నేతలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు నియామక పదవులపై ఆశపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే జరిగిన వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ చేసిన ప్రసంగం ఎమ్యెల్యేలకు షాక్ ఇచ్చింది. నేను ఆరు నెలల నుంచి సంవత్సరంలోగా మంచి సీఎంగా గుర్తింపు తెచ్చుకుంటానని జగన్ అన్నారు.

రాష్ట్రంలో అవినీతి ప్రక్షాళన చేస్తాననీ, పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుడతాననీ, ప్రజలకు చేరువగా పాలనను అందిస్తాననీ ఆయన పదేపదే చెబుతూ వస్తున్నారు. రూపాయి అవినీతి కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాననీ, గ్రామ సెక్రటేరియట్‌తో వాలంటీర్లు నియామకం చేపట్టి ప్రజలకు అవసరమైన అన్ని పనులను 72 గంటల్లోపు చేస్తానని జగన్ చెబుతున్నారు. ఇదంతా అందరికి సంతోషాన్ని కలిగించింది.

ఈ సమయంలోనే “నిబంధనలకు విరుద్ధంగా మీరు ఏ పనులు అడిగినా, ఏమి చేయమన్నా ఎట్టి పరిస్థితుల్లో చేయబోను. అటువంటివి ఏమైనా ఉంటే నా వద్దకు అస్సలు తీసుకురావొద్దు” అంటూ స్పష్టంగా చెప్పేశారట. మీకు ప్రజలు అప్పగించిన పనిని, ఇచ్చిన పదవిని సమర్ధవంతంగా వారి సేవకోసం వినియోగించాలని సూచించారట.

2019 అయిపోయింది. ఇక ఇప్పుడు మన లక్ష్యం 2024 అనేది ఇప్పటి నుంచే గుర్తుపెట్టుకోండి అని ఆయన ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేశారు. గ్రామాల్లో, నగరాల్లోనూ అనుచరవర్గాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఇప్పుడు ఆదాయ మార్గాలు, పైరవీల ద్వారా తమ అనుచరుల పనులు చేసిపెడదాం అన్నా కుదిరేలా కనిపించడంలేదని వారు లబోదిబోమంటున్నారు.