జగన్ నమ్ముకున్న “కమ్మ నేతల సత్తా” ఎంత..?

జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని తమవైపుకు ఎలా తిప్పుకోవాలో అని వ్యూహాలు పన్నుతున్నాడు.అయితే సామాజిక వర్గాల వారీగా చూస్తే.

 Jagan Mohan Reddy Cast Politcs In Two Districts-TeluguStop.com

తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటినుంచీ ఇప్పటి వరకూ కూడా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశానికి కొండంత అండగా ఉంటూ వచ్చింది.ఎన్నికల ముందు ఎవరు ఎలా ఉన్నా సరే ఎన్నికల సమయంలో మాత్రం అందరూ ఒక్కటిగా నిలుస్తారు టిడిపి పార్టీ కి అండగా నిలబడుతారు.

అయితే ఎన్టీఆర్ దగ్గర నుంచీ చంద్రబాబు వరకూ కూడా పార్టీ నిర్మాణంలో కానీ , పదవులని పంచడంలో కాని అన్ని కులాల ప్రాతిపదికన సామాజిక వర్గాలకి కూడా న్యాయం చేసేవారు.తమ కులానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నడూ .అనుకోలేదు

అయితే వైఎస్ తన హయాంలో రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు అంతేకాదు బీసీ కులస్తులని పెద్దగా పట్టించుకునే వారు కాదు కూడా.అదే విధంగా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సైతం ఎక్కవగా రెడ్డి కులస్తులకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు గత ఎన్నికల్లో కమ్మ సామజిక వర్గం ఎక్కువగా ఉన్న గుంటూరు ,కృష్ణా జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చే విషయంలో సైతం కమ్మ వర్గాన్ని పక్కకి పెట్టేశాడు.కేవలం ఒక్కటంటే ఒక్క సీటు అది కూడా గుడివాడ నాని కి తప్ప మరో కమ్మ వ్యక్తికీ సీటు ఇవ్వలేదు దాంతో గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు జగన్ కి భారీ ఘలక్ ఇచ్చారు.

ఇదిలాఉంటే ఇప్పుడు జ‌గ‌న్ క‌మ్మ‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

అందులో భాగంగానే ఈ రెండు జిల్లాల్లో ఎక్కువుగా క‌మ్మ‌ల‌కు సీట్లు ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నాడు…కానీ సీట్ల కోసం జగన్ వద్దకి వెళ్తున్న నేతల్లో ఎవరికీ కనీసం వార్డు మెంబెర్ అయ్యే లక్షణాలు కూడా లేవని.టిడిపిలో టిక్కెట్టు రాదు అనుకున్న కొంతమంది జగన్ వద్దకి చేరుతున్నారు అంటున్నారు టిడిపి నేతలు.

గుంటూరులో ఎంపీగా దిగుతోన్న లావు ర‌త్త‌య్య కుమారుడు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులుకు నిజంగా జ‌య‌దేవ్‌ను ఢీ కొట్టే ద‌మ్ముందా అని లెక్కలు వేస్తే అసలు అతడు నియోజకవర్గాలో ఎవరికీ తెలియను కూడా తెలియదు అయినా అంట సీన్ అ ఫ్యామిలీ కి లేదు అని తీసి పడేస్తున్నారు.

అయితే 2009 సంవత్సరంలో ముక్కోణపు పోరులో గెలిచినా రవి ప్రజలకి ఎప్పుడు దగ్గరగా లేడు.

ఇక గన్నవరంలో అయితే వంశీని కొట్టిన మగాడు లేదనే చెప్పాలి.యార్ల గడ్డకి అంతసీన్ లేదని అంటున్నారు.

ఇక గుడివాడ విషయానికి వస్తే ఇక్కడి నుంచీ నాని మూడు సార్లు గెలిచినా సరే తన నియోజకవర్గానికి చేసింది మాత్రం సూన్యం అనే చెప్పాలి.ఈ సారి మాత్రం నాని పరాజయం తధ్యం అంటున్నారు విశ్లేషకులు మరి ఇక య‌డ్ల‌పాటి వెంక‌ట్రావు, అన్నాబ‌త్తుని శివ‌కుమార్ వంటి నేతలు గురించి చెప్పుకోవలసిన అవసరం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఇలాంటి వాళ్ళు అందరిని పక్కన పెట్టుకుని జగన్ కమ్మ వర్గం నేతలు మొత్తం నా వైపు ఉన్నారని అనుకోవడం ఎంతో మూర్ఖత్వం అంటున్నారు టిడిపి సీనియర్స్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు