ప్రత్యేక హోదాపై వైసీపీ పోరాడుతుందా... బ్రతిమలాడుతుందా

ఏపీ విభజన హామీలలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చింది.దీనిపై పార్లమెంట్ లో తీర్మానం కూడా పెట్టారు.

 Jagan Modi Babu Special Status Jagan Babu-TeluguStop.com

బీజేపీ పార్టీ కూడా గత ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా విషయంలో కట్టుబడి ఉన్నామని చెప్పింది.తరువాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసిందే.

బీజేపీ ప్రత్యేక హోదాపై మాట తప్పడం, తీదీపీ స్టాండ్ మార్చుకోవడం మరల ఎన్నికల ముందు ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకోవడం జరిగింది.అయితే తతంగంలో టీడీపీ తాజాగా ఎన్నికలలో భారీగా దెబ్బతింది.

ఇక ప్రత్యేక హోదా అంశాన్ని తమకి అనుకూలంగా మార్చుకొన్న వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు అవుతున్న వైసీపీ హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా పోరాటంపై అస్సలు మాట్లాడలేదు.

దానిని పక్కన పెట్టి రకరకాల బిల్లులు తీసుకొచ్చి ప్రజలని కన్ఫ్యూజన్ లో పెట్టారు.ఇదిలా ఉంటే త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రత్యేక హోదాతో పాటు మరికొన్ని డిమాండ్లు తెరపైకి తీసుకొచ్చారు.

వాటిని మీడియాతో పంచుకున్నారు.వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా,.కాగ్ ఆడిట్ ప్రకారమే రెవెన్యూ లోటు నిధులు విడుదల.రాజధానిలో మౌలిక వసతులకు తగిన నిధులు కేటాయింపు.రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు సహా మౌలిక వసతుల నిర్మాణాలకు నిధులు కేటాయింపు, రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.18,969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల వంటివి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలని భావిస్తున్నారు.అయితే ఈ డిమాండ్లతో వైసీపీ ఎంపీలు ఎప్పటిలానే బ్రతిమలాడే పద్దతిలోనే వెళ్తారా, లేక పోరాటం చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube