నేడు గవర్నర్ తో జగన్ ! మంత్రివర్గ విస్తరణ పై వీరిలో ఆశలు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జగన్ మంత్రివర్గ విస్తరణ చేపడతారని చాలా రోజులుగా వైసీపీలో హడావుడి జరుగుతుంది.  కొంతమంది మంత్రులను తప్పించి వారి స్థానంలో కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తారని,  అలాగే కొన్ని కొన్ని సామాజిక వర్గాల పరిగణలోకి తీసుకుని ఈసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారని ప్రచారం వైసీపీలో జరుగుతోంది.

 Jagan Meet With The Governor Today They Hope For The Expansion Of The Ap Cabine-TeluguStop.com

దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో పాటు , మంత్రి పదవి పై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న జగన్ కు సన్నిహితమైన వ్యక్తులు , కీలక నాయకులు,  మంత్రివర్గ విస్తరణ పై ఆశగా ఎదురుచూస్తున్న వారు,  ఎప్పుడు జగన్  మంత్రివర్గ విస్తరణ చేపడతారా ?  తమకు అవకాశం దక్కుతుందా అనే ఆసక్తితో ఎదురుచూపులు చూస్తున్నారు .అయితే ఈ రోజు జగన్( Jagan ) సాయంత్రం ఐదు గంటలకు రాజ్ భవన్ కు వెళ్ళనున్నారు.  అక్కడ గవర్నర్ తో  ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు .అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ కు జగన్ ధన్యవాదాలు తెలిపేందుకు మర్యాదపూర్వకంగా భేటీ కాబోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్న , జగన్ మంత్రివర్గ విస్తరణ పైనే చర్చించేందుకు గవర్నర్ ను కలవబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

Telugu Ap Asembly, Ap, Ap Cm Jagan, Ap Governor, Mlc, Ysrcp-Politics

 ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హడావుడి జరుగుతున్న నేపథ్యంలో … ఈరోజు గవర్నర్( Abdul nazeer ) ను కలవబోతున్న జగన్ కదలికలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.గవర్నర్ ను కలిసిన తర్వాత జగన్ రేపు విశాఖకు వెళుతున్నారు.  రేపు సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖకు వెళ్తారు.అక్కడ 6 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్స్ కు చేరుకుని జి20లతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

Telugu Ap Asembly, Ap, Ap Cm Jagan, Ap Governor, Mlc, Ysrcp-Politics

రాత్రి బస తర్వాత తిరిగి విశాఖ నుంచి తాడేపల్లి( Tadepalle ) కి జగన్ చేరుకుంటారు.ఇక తర్వాత మంత్రివర్గ విస్తరణ పై జగన్ సంకేతాలు ఇస్తారని ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న వారు అంచనా వేస్తున్నారు .ఇప్పటికే జగన్ మంత్రివర్గ విస్తరణ పై ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ?  ఎవరెవరికి అవకాశం కల్పించబోతున్నారు ? ఎవరికి పదవి గండం ఉంది అనే విషయాలపై పార్టీ కీలక నాయకుల ద్వారా ఆరా తీసే పనిలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube