మోదీ క్యాబినెట్ లోకి మెగాస్టార్..?  

Jagan Meet Narendra Modi About Three Capitals In Ap - Telugu Ap Cm Jagan Mohan Reddy, Jagan, Jagan And Chiranjeevi, Jagan And Modi, Mega Star Chiranjeevi, Ycp Minister Vijay Sai Reddy

ప్రధానమంత్రి మోదీ తో నిన్న జరిగిన సమావేశంపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చాలా ఆనందంతో ఉన్నారు.గతంలో పలుమార్లు మోదీని కలిసేందుకు జగన్ ప్రయత్నించినా అది సాధ్యపడలేదు.

Jagan Meet Narendra Modi About Three Capitals In Ap - Telugu Ap Cm Jagan Mohan Reddy, Jagan, Jagan And Chiranjeevi, Jagan And Modi, Mega Star Chiranjeevi, Ycp Minister Vijay Sai Reddy-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రకరకాల కారణాలతో జగన్ కు అపాయింట్మెంట్ వాయిదా వేస్తూ వచ్చారు.కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిన్న జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చి సుమారు గంటన్నర సేపు మోదీ జగన్ మాట్లాడుకున్నారు.

ఈ సందర్భంగా ఏపీ కి సంబంధించిన అనేక విషయాలపై జగన్ మోదీ దృష్టికి తీసుకురాగా అంశాలపై స్పందించారు.ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు, ఏపీ శాసనమండలి రద్దు , పోలవరం ప్రాజెక్టుకు నిధులు తదితర విషయాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారట.

ఈ సందర్భంగా వైసిపి కేంద్ర కేబినెట్ లోకి వచ్చే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేంద్రానికి వైసీపీ మద్దతు అవసరం.ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వైసీపీకి రెండు మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అంతకు ముందు ఇదే ప్రతిపాదన బిజెపి చేసినా జగన్ ఎన్డీయేలోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

కానీ ఇప్పుడు ఎపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పదవి తీసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుందనే ఆలోచనతో జగన్ ఈ ప్రతివాదనకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి అన్న విషయం పైన కూడా లోతుగా మోదీ జగన్ మధ్య చర్చ జరిగిందట.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే విషయమై ఇద్దరు చర్చించుకున్నారట.

ప్రస్తుతానికి చిరంజీవి ఏ పార్టీలోనూ లేరు.అయినా ఆయన గత కొంత కాలంగా వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు.ఈ క్రమంలో ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తే ఆ కోటలో కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించేలా చేయవచ్చని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

మరో మంత్రి పదవిని విజయ సాయి రెడ్డి కి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.ఒకవేళ చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా ఆ స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నందిగాం సురేష్ కు అవకాశం కల్పించే విధంగా జగన్ చర్చించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

తాజా వార్తలు

Jagan Meet Narendra Modi About Three Capitals In Ap-jagan,jagan And Chiranjeevi,jagan And Modi,mega Star Chiranjeevi,ycp Minister Vijay Sai Reddy Related....