గంటా వైసీపీ ఎంట్రీపై జ‌గ‌న్ మార్క్ ట్విస్ట్ ఇదే..!

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు వైసీపీ ఎంట్రీపై కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.ఇప్పుడు సీన్ చూస్తుంటే గంటా వైసీపీలో చేరే స‌మ‌యం ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని.

 Ys Jagan Mark Twist About Ganta Srinivas Rao Entry In Ysrcp,ys Jagan, Ganta Srin-TeluguStop.com

జ‌గ‌న్ సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మంచి ముహూర్తం చూసుకుని గంటా పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది.నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న వైసీపీ ఎంట్రీని జిల్లాకే చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించారు.

ఇప్పుడు గంటాను పార్టీలో చేర్చుకుంటే ఉత్త‌రాంధ్ర‌లో పార్టీకి చాలా ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తోన్న జ‌గ‌న్ త‌మ పార్టీ నేత‌ల‌కు స‌ర్ది చెప్పిన‌ట్టు తెలుస్తోంది.చివ‌ర‌కు గంటా ఎంట్రీని ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌తిరేకించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఎట్టకేలకు అంగీకరించారట‌.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు గంటా వైసీపీ ఎంట్రీని తీవ్రంగా వ్య‌తిరేకించిన విజ‌య‌సాయి గంటా విద్యా మంత్రిగా ఉన్న‌ప్పుడు సైకిల్ కుంభకోణం జ‌రిగింద‌ని, భూ దందా జ‌రిగింద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.
గంటాను వైసీపీలో చేర్చుకోమ‌ని చెప్పిన విజ‌య‌సాయి ఇప్పుడు జ‌గ‌న్ ముందు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయ‌ని.

పెద్ద‌గా అభ్యంత‌రాలు లేవ‌నే చెపుతోన్న ప‌రిస్థితి.గంటా పార్టీలోకి వ‌స్తే ఉత్త‌రాంధ్ర‌లో సైకిల్ కుదేల్ అవుతోంద‌ని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

అంత ఛ‌రిష్మా ఉన్న నాయ‌కుడు పార్టీలోకి వ‌స్తే అడ్డుకోవ‌డం స‌రికాద‌ని కూడా జ‌గ‌న్ చెప్ప‌డంతో విశాఖ వైసీపీ నేత‌లు కాస్త కూల్ అయ్యారంటున్నారు.

ఏదేమైనా గంటా వైసీపీ ఎంట్రీపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌స్పెన్స్‌ను జ‌గ‌న్ తొల‌గించేశాడు.

ఇక పార్టీ మార‌డ‌మే మిగిలి ఉంది.గంటా త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకుని వైసీపీ కండువా క‌ప్పుకుంటారా ?  లేదా ?  త‌న త‌న‌యుడు, అనుచ‌ర‌గ‌ణాన్ని వైసీపీలో చేర్పిస్తారా ? అన్న‌ది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube