శభాష్ జగన్ ! మేలు చేసిన  రద్దు నిర్ణయం  ? 

ఏపీ సీఎం జగన్ ఏది చేసిన ముందు చూపుతోనే చేస్తూ ఉంటారు.ఈ సందర్భంగా వచ్చిన విమర్శలను ఏ మాత్రం పట్టించుకోరు.

 Jagan Made The Right Decision To Cancel The Election Campaign Rally In Tirupati-TeluguStop.com

తాను ఏదైతే అనుకున్నాడో అది మాత్రమే చేసి చూపించడం జగన్ స్టైల్.  ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎనకల సందర్భంగా జగన్ తీసుకున్న నిర్ణయంతో పెద్ద ఎత్తున విమర్శలు రాగా,  జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు అదే విషయం పై జగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  జగన్ ముందు చూపు వ్యక్తి అని , అంతా అభిప్రాయపడుతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా , అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నిర్వహించాయి.అంతేకాదు టిడిపి అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  బిజెపి నాయకులు తిరుపతి లో చాలా రోజుల పాటు ప్రచారం నిర్వహించారు.

కానీ వైసీపీ తరఫున ఆ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ప్రచారం నిర్వహించారు.అయితే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో జగన్ సైతం తిరుపతిలో ఎన్నికల ప్రచారం చేసేందుకు ముందుగా సిద్ధమైన, కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో,  తన పర్యటనను వాయిదా వేసుకుంటున్నాను అంటూ ప్రజలకు బహిరంగ లేఖ సైతం రాశారు.

 దీనిపై వైసిపి రాజకీయ ప్రత్యర్ధులు జగన్ కు ఓటమి భయం పట్టుకుందని , అందుకే ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా వెనకడుగు వేశారని, పదే పదే విమర్శలు చేసినా,  జగన్ ఏ మాత్రం లెక్కచేయలేదు.  ఇప్పుడు చూస్తే తెలంగాణ లో సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.

ఇటీవల నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా,  ఆ సభలో పాల్గొన్న పార్టీ నాయకులకు, నాగార్జునసాగర్ టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు,  వారి కుటుంబ సభ్యులకు మరి కొంతమంది నాయకులకు కరోనా పాజిటివ్ గా తేలింది.అంతేకాదు ఆ సభకు హాజరైన చాలామంది జనాలకు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

దీంతో  జగన్ ఈనెల 14వ తేదీన ఎన్నికల సభను రద్దు చేసుకోవడం మంచిది అయ్యింది అని,  లేకపోతే జగన్ తో పాటు, ఆ సభకు హాజరైన జనాలకు కరోనా సోకే ఆస్కారం ఉండేదనే చర్చ జరుగుతోంది.  ఎందుకంటే తిరుపతి లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం వైసిపి గెల్చుకున్నవే.

Telugu Ap Poltics, Civid, Cm Jagan Mohan, Cm Kcr, Corona, Nagarjuna Sagar, Nomul

దీంతో జగన్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షలాదిమంది జనాలు ఆ సభకు హాజరయ్యేలా ఎమ్మెల్యేలు జన సమీకరణ చేపట్టి ఉండేవారు.  కానీ జగన్ తీసుకున్న కీలక నిర్ణయం కారణంగా ఇవన్నీ జరగలేదు.అదే సభ నిర్వహించి ఉంటే వైసీపీ నాయకులతో పాటు,  ఆ సభకు హాజరైన జనాల్లో చాలామంది తగిన మూల్యం చెల్లించుకుని ఉండేవారని, జగన్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే ప్రశంసలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube