చేసింది చెప్పుకోలేకపోతున్న జగన్  

Jagan Launch The So Many Schems In Ap-jagan,jagan And Agri Gold,jagan And Auto Drivers,jagan And Chandrababu Naidu,jagan Launch The Raithu Barosa

పావలా కూరకు పదిరూపాయల మషాలా జత చేసినట్టుగా కొందరు చేసింది తక్కువే అయినా ప్రచారం మాత్రం గొప్పగా చేసుకుని ప్రజల్లో పలుకుబడి పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే ఏపీ అధికార పార్టీ వైసీపీ ఈ విషయంలో బాగా వెనకబడి పోయింది.అధికారంలోకి వచ్చిన ఆరు నెలల సమయంలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా చిత్తశుద్ధితో పనిచేసి జగన్ రికార్డు సృష్టించాడు.ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అతి తక్కువ సమయంలో లో ఇన్ని పనులు చేసిన ఘనత జగన్ కు దక్కుతుంది.

Jagan Launch The So Many Schems In Ap-jagan,jagan And Agri Gold,jagan And Auto Drivers,jagan And Chandrababu Naidu,jagan Launch The Raithu Barosa Telugu Political Breaking News - Andhra Pradesh,Telang-Jagan Launch The So Many Schems In AP-Jagan Jagan And Agri Gold Auto Drivers Chandrababu Naidu Raithu Barosa

అయితే ఎంత చేసినా వైసీపీ ప్రభుత్వానికి అనుకున్న స్థాయిలో మైలేజ్ రాలేదు.తాను చేసిన పనులను కూడా సరైన విధంగా ప్రచారం చేసుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు.కానీ అదే సమయంలో జగన్ రాజకీయ ప్రత్యర్థులు రాజధాని నిర్మాణం, ఇసుక కొరత తదితర అంశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా చేసి వారు ఎక్కువ ప్రచారం పొందారు.

ప్రత్యర్థుల ప్రచారాన్ని అడ్డుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయిందనే చెప్పాలి.ఇసుక కొరత గురించి ప్రజలకు సరైన కారణం చెప్పలేక వైసీపీ ప్రభుత్వం విమర్శల పాలైంది.

ప్రతిపక్షాలు ఆ సమయంలో ఒకరిద్దరు మంత్రులు, అధికార ప్రతినిధులు తప్ప మీడియా ముందు వాయిస్ వినిపించి బలంగా ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయడంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు విఫలమయ్యారు.ఒక రకంగా చెప్పాలంటే జగన్ చేసిన మంచి పనుల కంటే ఆయన చేసిన చిన్న చిన్న తప్పిదాలే ఎక్కువ ప్రచారం పొంది జగన్ విమర్శల పాలయ్యేలా చేసింది.గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొంత చేసినా దానికి నాలుగింతలు ప్రచారం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేవారు.అసలు ఒక పథకం ప్రవేశపెట్టేముందే ఒక నాలుగు రోజులు ముందుగా ప్రచారం మొదలుపెట్టి, ప్రకటనలు, ఫ్లెక్సీలతో రాష్ట్రమంతా హోరెత్తించేవారు.

కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ఆరు నెలల కాలంలోనే చేసినా వాటిని ప్రచారం చేసుకునే విషయంలో మాత్రం బాగా వెనకబడి పోయింది.గత ప్రభుత్వం హామీలు చాలా వరకు అమలు చేయలేదు.కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాము చెప్పినవి అన్నిటిని చేసి చూపించారు.

ఉదాహరణగా చెప్పుకుంటే అగ్రిగోల్డ్ బకాయిల చెల్లింపులు చేశారు జగన్.20 వేల వరకు ఉన్న వాటికి నిధులు విడుదల చేశారు.అయితే దానికి ప్రచారం మాత్రం చాలా తక్కువగా చేసుకున్నారు.

ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు అందించారు.దానికి సరైన ప్రచారం చేయలేకపోయారు.ఇక పోలీసులకు వారాంతపు సెలవులు ఇచ్చారు ఈ విషయాన్ని కూడా హైలెట్ చేసుకోలేకపోయారు.అన్నిటికన్నా ముఖ్యంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సాహసోపేతమైన నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు.

కానీ ఈ విషయం కూడా హైలెట్ అవ్వలేదు.టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ ఎన్నికల కోసమే అన్నట్టుగా ప్రవేశపెట్టారు.కానీ జగన్ ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువే అందించారు.కానీ దానికి కూడా ప్రచారం అంతంతమాత్రంగానే ఉంది.

స్పందన కార్యక్రమంకు కూడా ప్రజల నుంచి స్పందన బాగానే వస్తున్నా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మైలేజ్ పొందలేకపోయింది.ఇక జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.అయితే ప్రజల నుంచి మాత్రం సంపూర్ణ మద్దతు లభించింది.జగన్ తీసుకునే నిర్ణయం ఆయనకు ఎక్కడలేని ఇమేజ్ తీసుకు వచ్చింది.

అయితే దానిని కూడా సరైన విధంగా తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు.అలాగే ఇప్పుడు వరకు ఏపీ చరిత్ర ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగాలు జగన్ భర్తీ చేశారు.వీటిని కూడా పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయారు.ఇలా అన్నిటిలోనూ జగన్ తన మార్క్ చూపిస్తున్నా ప్రచారంలో బాగా వెనుకబడిపోవడం జగన్ వైఫల్యంగానే కనిపిస్తోంది.