ఆ నిఘా యాప్ తో జగన్ ఏం చేయబోతున్నాడు ?

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూనే ఉన్నారు.జగన్ గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అవేమీ పట్టించుకోకుండానే తాను అనుకున్నది ఏదో చేసి చూపిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు.

 Jagan Launch The Nigha Mobile App-TeluguStop.com

ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఎక్కువైంది.ఈ నెలలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కసితో అధికార పార్టీ ఉండగా, ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత సూచనల మేరకు టిడిపి నాయకులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగాయి.ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం, బీసీ రిజర్వేషన్లు తదితర కారణాలు చూపిస్తూ ఎన్నికలు వాయిదా వేయించాలని టిడిపి పోరాడుతోంది.

Telugu Ap, Chandrababu Ycp, Jagan, Jagan Tdp, Jagan Latest, Jaganlaunch-Politica

జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా, ఎన్నికలను పూర్తి చేయాలని తలంపుతో ముందుకు వెళ్తున్నారు.అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు జరగకుండా ఇప్పటికే జగన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు.ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా అక్రమాలకు కానీ, డబ్బులు పంచుతూ దొరికితే వారు గెలిచినా వారిపై అనర్హత వేటు వేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.ఇదే విషయమై ఈరోజు ప్రత్యేక ఏర్పాట్లు జగన్ ప్రత్యేకంగా నిఘా మొబైల్ యాప్ తయారు చేయించారు.

ఈ యాప్ ను శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు.

నిఘా మొబైల్ యాప్ ద్వారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని జగన్ ఆదేశించారు.

ముఖ్యంగా డబ్బు, మద్యం, పంపిణీ తో పాటు ఎటువంటి అక్రమాలపైనా ఫిర్యాదు చేసే విధంగా యాప్ తయారుచేయించారు.మొబైల్ యాప్ సామాన్యుడి చేతిలో అవినీతిపై అస్త్రం గా మారబోతుందని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఎవరైనా సులభంగా ఈ మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని, దీనిని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు జగన్ తెలిపారు.ఎన్నికల్లో అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ కు చేరే అవకాశాన్ని విధానాన్ని ఏర్పాటు చేశారు.

దీంతో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించబోతున్నారు అనే విషయం అర్థం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube