భరిస్తారా వేటువేస్తారా ? జగన్ నిర్ణయంతో ప్రకంపనలే ?

జనాలకుపార్టీ నేతలకు అందరికీ అన్ని రకాలుగానూ, మేలు జరిగే విధంగా చేస్తున్నా, ప్రభుత్వానికి పార్టీకి ఆశించినంత స్థాయిలో మద్దతు రాకపోగా, గతంతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.కరోనా కష్ట కాలం లోనూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలను అమలుచేసి చుపిస్తున్న, ఇప్పటికీ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నా, క్రెడిట్ రాకపోవడానికి కారణం ఏంటి అనే విషయం పై జగన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.

 Jagan, Ysrcp,ap Government, Muncipal Elections, Panchayathi, Mla, Mps, Ministers-TeluguStop.com

ప్రస్తుతం హోరాహోరీగా మున్సిపల్ ఎన్నికల హడావుడి నడుస్తోంది.పార్టీ కోసం నాయకులు గట్టిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే పంచాయతీ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు జగన్ కు ఆగ్రహం కలిగిస్తోంది.

పార్టీలో ఎప్పటి నుంచో గ్రూపు రాజకీయాలు , పెరిగిపోతూ, ఎక్కడికక్కడ అసంతృప్తులు పెరిగిపోతున్నాయనే విషయం జగన్ కు తెలుసు.

అయితే ఇవన్నీ సర్వసాధారణమేనని, ఇవన్నీ సర్దుకు పోతాయని చూస్తూ వస్తున్నా, సొంత పార్టీలోని తమ వ్యతిరేక వర్గం గెలవకూడదు అనే ఉద్దేశ్యంతో కొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీలతో కలిసి సొంత పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు , వారి ఓటమికి కృషి చేయడం వంటివి ఎన్నెన్నో అంశాలు ఇప్పుడు జగన్ వరకు వెళ్లాయట.

Telugu Ap, Chandrababu, Constency, Jagan, Ministers, Mps, Muncipal, Panchayathi,

ప్రతి నియోజక వర్గం నుంచి జగన్ నివేదికలు  తెప్పించుకున్నారట.పార్టీకి చేటు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న తీరు పై ఇక ఉపేక్షించేది లేదని, అవసరమైతే పార్టీకి చేటు చేస్తూ, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నవారిని పార్టీనుంచి సాగనంపాలని, కొందరికి వార్నింగ్ లు ఇచ్చి గాడిలో పెట్టకపోతే, సార్వత్రిక ఎన్నికల నాటికి వైసిపి కి గెలుపు కష్టమవుతుందని, ప్రజల్లో రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతో ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వెస్తున్నరట.అయితే ఒక్కసారిగా అన్నిచోట్లా పార్టీ నేతలపై చర్యలు ప్రారంభిస్తే అలజడి రేగుతుందని, టీడీపీ దీనిని అవకాశంగా తీసుకుని రాజకీయం చేసే అవకాశం ఉంది అనే ఆలోచనతో తర్జనభర్జన పడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube