మళ్లీ లేఖల యుద్ధం మొదలు పెట్టిన జగన్, కేసీఆర్..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కారు మధ్య రోజురోజుకూ నీటి వివాదాలు ముదురుతున్నాయి.నీటి వివాదాలపై రాజ్యాంగ పరిధిలో మధ్యవర్తిత్యం చేస్తానని స్వయంగా సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ పేర్కొన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించలేదు.

 Jagan, Kcr Start War Of Letters Again,  Jagan Kcr , Krishna Water , Superm Court-TeluguStop.com

దానికి తోడు ఏపీ సర్కారు దాదాగిరిచేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్ చేయడంతో వివాదం ఇంకా కాస్తా ముదిరింది.ఇకపోతే ఇరు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మళ్లీ లేఖల యుద్ధం షురూ చేశాయి.

కృష్ణా, గోదావారి బోర్డుల సమావేశానికి రాబోమంటూ తెలంగాణ సర్కారు తేల్చి చెప్తోంది.ఈ క్రమంలోనే ఏపీ సర్కారు సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్‌పై ఆరోపణలు చేసింది.దీంతో తెలంగాణ సర్కారు ఏపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇకపోతే ఈ నెల 3న కేఆర్ఎంబీ, ఆర్ఎంబీ సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించగా, ఆ మీటింగ్‌ను తెలంగాణ ఆఫీసర్స్ బై కాట్ చేశారు.

పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఇరు బోర్డులకు, కేంద్రానికి లేఖ రాశారు.అలా తెలంగాణ సర్కారు లేఖల యుద్ధానికి తెరలేపింది.

తెలంగాణ సర్కారు రాసిన లేఖపై కేంద్రం స్పందించింది కూడా.ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన కృష్ణా, గోదావరి బోర్డుల అత్యవసర పూర్తి స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది.

అయితే, ఈ సమావేశానికి హాజరు కాబోమంటూ తెలంగాణ సర్కారు తెలిపింది.న్యాయస్థానాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక కేసులు విచారణ దశలో ఉన్నందున బోర్డు నిర్వహించే మీటింగ్స్ హాజరు కాలేమని పేర్కొంది.

Telugu Ap, Godavari, Jagan, Kcr, Krishna, Superm, Telengan-Telugu Political News

ఈ నేఫథ్యంలోనే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.తెలంగాణ నుంచి వచ్చిన సమాచారంతో మీటింగ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు.మీటింగ్‌కు సంబంధించిన వివరాలు త్వరలో తెలుపుతామని, త్వరలోనే మీటింగ్ కండక్ట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు.ఇదిలా ఉండగా ఏపీ సర్కారుపై తెలంగాణ ఈఎన్‌సీ ఫైర్ అయ్యారు.

కృష్ణా బోర్డుకు ఈ మేరకు తెలంగాణ ఈ‌ఎన్‌సీ మురళీధర్ లెటర్ రాశారు.ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనలో సీడబ్ల్యూసీ మెంబర్‌గా దేవేందర్ రావు ఉండటం పట్ల ఏపీ అభ్యంతరం తెలపగా, ఈ విషయమై తెలంగాణ స్పందించింది.ఈ క్రమంలోనే సుదీర్ఘమైన లేఖను పంపింది.గతంలో ఉన్న సీడబ్ల్యూసీ మెంబర్స్‌పై తాము ఎలాంటి ఆబ్జెక్షన్ చేయలేదని, ప్రజెంట్ సీడబ్ల్యూసీ మెంబర్‌పై ఏపీ అభ్యంతరం చెప్పడం సరికాదంటూ తెలంగాణ ఈఎన్‌సీ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తానికి లేఖల వల్ల వివాదం ఇంకా ముదురుతన్నదనే చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube