ఒకే వేదిక‌పైకి జ‌గ‌న్‌, కేసీఆర్‌.. ఏమైనా మాట్లాడుకుంటారా..?

గ‌త కొద్ది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు నీటి ప్రాజెక్టుల విష‌యంలో పోరాడుతున్న‌ సంగ‌తి తెలిసిందే.లేఖ‌లు రాస్తూ పెద్ద దుమార‌మే రేపాయి.

 Jagan, Kcr On The Same Platform Do You Speak Anything , Jagan, Kcr , Delhi-TeluguStop.com

కాగా అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే వేదిక‌పై క‌లుసుకోని కేసీఆర్‌, జ‌గ‌న్‌లు ఇద్ద‌రూ కూడా ఇప్పుడు క‌లుసుకోనున్నారు.అదేనండి ఇప్పుడు న‌క్స‌ల్స్ ప్ర‌భావం ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌తో ఈ నెల 26న కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు.

కాగా ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల‌కు కూడా ఆహ్వానం పంపారు.ఇక కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి పయనమవుతున్నారు.

కాగా ఆయ‌న మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు.

ఇక ఏపీ సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డి కూడా త్వ‌ర‌లోనే ఢిల్లీకి ప‌య‌న‌మ‌వుతున్నారు.

ఇక అక్క‌డ‌కు వెళ్లిన త‌ర్వాత ఎలాగూ ఇద్ద‌రూ క‌లిసి ఒకే వేదికపై కూర్చోవాల్సి వ‌స్తుంది.ఇక ఆ ప్రాంగ‌ణంలో ఎలాగూ క‌లుసుకోవాల్సి వ‌స్తుంది.

మ‌రి ఇలా క‌లుసుకుని ఏమైనా పలకరించుకుని మాట్లాడుకుంటారా లేదంటే న‌మ‌స్కారం పెట్టుకుని సైలెంట్ గా వెళ్లిపోతారా అనేది వేచి చూడాల్సి ఉంది. మొద‌ట్లో ఇద్ద‌రూ మంచి మిత్రులుగానే మెలిగినా కూడా జల వివాదాల త‌ర్వాత ఇరువురు న్యాయపోరాటాలు చేస్తున్నారు.

ఇక కేంద్రం ద‌గ్గ‌ర‌కు పంచాయితీని తీసుకెళ్లారు.

Telugu Jagan, Kcr Platm-Telugu Political News

అప్ప‌టి నుంచి ఒక్క‌సారి కూడా క‌లుసుకోలేని ఇరువురు సీఎంలు ఇప్పుడు ఢిల్లీలో నేరుగా ఒకే సమావేశానికి వెళ్తున్న క్ర‌మంలో ఏమైనా సమస్యల‌పై కేంద్ర మంత్రుల ద‌గ్గ‌ర చ‌ర్చిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఇక ఇప్ప‌టికే ఈ వివాదాన్ని స‌మార‌స్యంగా పరిష్కరించుకోవాల‌ని అటు సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిన విష‌యం అంద‌రికీ విదిత‌మే.మ‌రి ఇరువురు ఎలాగూ ఢిల్లీ వెళ్తున్నారు కాబ‌ట్టి కేంద్ర‌మంత్రుల ద‌గ్గ‌ర ఇద్ద‌రూ కూర్చుని చ‌ర్చించుకుంటారా లేదంటే కేవ‌లం స‌మావేశానికి మాత్ర‌మే వెళ్లి వ‌స్తారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube