జేసీ దివాకర్ రెడ్డికి షాక్ ఇచ్చిన జగన్

ఏపీ రాజకీయాలలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకి శత్రువులుగా భావిస్తున్న అందరిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకి గురి చేస్తున్న జగన్ కి అనంతరపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైన కూడా జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలో ఉండి రాజకీయాలు చేస్తున్నారు.

 Jagan Jc Diwakar Reddy-TeluguStop.com

ఇప్పటికప్పుడు అవకాశం దొరికిన ప్రతి సారి జేసీ ముఖ్యమంత్రి జగన్ మీద విమర్శలు చేస్తున్నారు.ఓ విధంగా జేసీ మాటలు జగన్ కి చాలా ఇబ్బందికరంగా మారాయి.

తన క్యారెక్టర్ డ్యామేజ్ చేసే విధంగా అతని వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో అవకాశం కోసం ఎదురుచూసిన జగన్ ఊహించని విధంగా జేసీకి గట్టి షాక్ ఇచ్చారు.

జేసీ దివాకర్ రెడ్డికి 2007లో ప్రభుత్వం సున్నపు రాతి గనుల లీజుకి ఇచ్చింది.

వీటిని ఇప్పుడు జగన్ సర్కార్ రద్దు చేసింది.అలాగే అనంతపురం జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి ఇచ్చిన లీజుల్ని కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులను గతంలో త్రిశూల్ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది.ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ జేసీ ఫ్యామిలీ వేయలేదు.దీంతో లీజుని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.దీంతో పాటు లీజు ప్రాంతం నుంచి 38,212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటంపై విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఓ విధంగా చెప్పాలంటే జేసీ మీద జగన్ ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడని ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

మరి ఈ విషయంపై జేసీ దివాకర్ రెడ్డి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube