ఆ ఘటనపై అనుమానాలున్నాయి ! హైకోర్టు లో పిటిషన్ వేసిన వైసీపీ   Jagan Issue Ysrcp Lanch Mosion Pititision In Highcourt     2018-10-26   12:46:15  IST  Sai M

విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌పై హత్యాయత్నం విషయంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి లంచ్‌మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపైనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో ధర్డ్‌ పార్టీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. సీఐఎస్‌ఎఫ్ అధికారుల నుంచి రిపోర్టు తీసుకోవడంతో పాటు సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. అటు వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్‌ యాదవ్, అమర్‌నాథ్‌ రెడ్డిలు కూడా పిటిషన్ దాఖలు చేశారు.