జగన్ కొత్త జిల్లాల అస్త్రం.. మ‌న‌మెందుకు చేయ‌లేదంటూ టీడీపీలో చ‌ర్చ‌

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటూనే తను చేయాలనుకుంటున్న పనిని ఇట్టే చేసుకుంటూ వెళ్తున్నాడు.తాజాగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల అస్త్రాన్ని వదిలాడు.

 Jagan Is The Target Of New Districts  Discussion In Tdp As To Why We Did Not , J-TeluguStop.com

దీంతో ప్రతిపక్ష టీడీపీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు.దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది.

జిల్లాల ఏర్పాటు అంశం కూడా చిన్నచితాకా విషయం కాదు.అమరావతి రాజధానిగా కొనసాగించాలనే సెంటిమెంట్ తో సమానంగా ప్రజల మనోభావాలు ముడిపడియున్నాయి.

ఇది ఒక్కసారి సక్సెస్ అయితే ప్రజల మనసుల్లో నాయకులు చిరకాలం గుర్తుండిపోతారు.తెలంగాణలోనూ స్థానిక టీఆర్ఎస్ ప్రభుత్వం 10 జిల్లాలను ఏకంగా 33 జిల్లాలుగా మార్చింది.

ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటు జరిగింది.

కొన్ని చోట్ల గొడవలు జరిగినా వాటిని సీఎం కేసీఆర్ సర్దుమణిగేలా చూశారు.

దీంతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయా జిల్లాల ప్రజలు భావిస్తున్నారు.దీంతో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దైవంగా మారిపోయారు.ఈ క్రమంలోనే జగన్ ఏపీలో వివిధ సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు.2019 ఎన్నికలతో పోలిస్తే జగన్ మైలేజ్ పెరిగింది.పార్టీ నేతలపై జనంలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా జగన్ కు ప్రజలు ఇంకా ఓట్లు వేస్తున్నారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈ కారణంతోనే వైసీపీ నేతలు బంపర్ మెజార్టీతో గెలుపొందారు.

తాజాగా కొత్త జిల్లాల విషయం వైసీపీకి ప్లస్ అవ్వగా.ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మాత్రం మైనస్‌గా మారనుంది.ఇతర పార్టీలకు కూడా ఎంతో కొంత డ్యామేజ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.అందువల్లే టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తలోనే జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వచ్చినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు.తీరా జగన్ దానిని అమలు చేసి చూపించారు.

గతంలోనే తాము ఈ పని చేసుంటే ఆ పేరు టీడీపీ ఖాతాలోకి వచ్చేది కదా అని టీడీపీ నేతలు అనుకుంటున్నారు.తమ హయాంలో తప్పు జరిగిపోయిందని ఇప్పుడు బాధపడుతున్నారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనని కొందరు నేతలు విమర్శిస్తున్నారు.

Jagan Is The Target Of New Districts Discussion In TDP As To Why We Did Not , Jagan, TDP - Telugu Jagan, Jagantarget

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube