బ‌ద్వేల్‌లో స‌రికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న జ‌గ‌న్‌..

మ‌న దేశంలో ఓ సాంప్ర‌దాయం ఉంది.ఎన్నిక‌లు ఏవైనా స‌రే పార్టీలు పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తుంటాయి.

 Jagan Is Setting A New Trend In Badwel-TeluguStop.com

ఇది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.ఇక మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న ఉప ఎన్నిక వ‌చ్చినా స‌రే పెద్ద ఎత్తున డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం ఎప్ప‌టి నుంచో చూస్తున్నాం.

కాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి.అందులో ఒక‌టి తెలంగాణ‌లో హుజూరాబాద్ వ‌స్తే ఎలాంటి ఖ‌ర్చులు జ‌రుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

 Jagan Is Setting A New Trend In Badwel-బ‌ద్వేల్‌లో స‌రికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న జ‌గ‌న్‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్ప‌టికే పెద్ద ఎత్తున అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఖ‌ర్చు చేస్తున్నాయి.

ఇంకోవైపు ఏపీలో వ‌చ్చిన బ‌ద్వేల్‌లో స‌రికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌.

అదేంటంటే తాను గ‌తంలో వ‌చ్చిన తిరుపతి లోక్ సభ ఉప ఎనికను ఆయ‌న స‌రికొత్త‌గా నిర్వ‌హించారు.ఈ ఉప ఎన్నిక‌లో ఒక్క రూపాయి కూడా తీయ‌కుండా కేవ‌లం అభివృద్ధి చేస్తున్న ప‌నులు గురించే చెప్తామ‌ని చెప్పారు.

దాంతో టీడీపీ కూడా ఖర్చు చేయలేదు.ఆ విధంగా తిరుపతి ఉప ఎన్నిక చాలా క్లీన్ గా న‌డిచింద‌నే చెప్పాలి.

ఇప్పుడు ఇదే సాంప్ర‌దాయాన్ని బ‌ద్వేల్ లోనూ నిర్వ‌హించాల‌ని అంటున్నారట జగన్.ఈ ఎన్నిక కోసైం కూడా ఒక్క పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా చూడాలంటున్నారంట‌.

Telugu Ap Poltics, Badvel, Badwell By-election, Chandra Babu, Jagan, Schemes, Tdp, Thirupathi Elections, Ysrcp-Telugu Political News

కేవ‌లం త‌మ ప్రభుత్వం ఏపీలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి అలాగే చేస్తున్న ప‌నులు గురించి మాత్ర‌మే ప్రచారం చేయాల‌ని అప్పుడే మంచి రిజల్ట్ వస్తుందంటూ జ‌గ‌న్ త‌న పార్టీ ఇన్ చార్జుల‌కు ఇప్ప‌టికే దిశా నిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది.దీంతో రాజ‌కీయాల్లో జ‌గ‌న్ స‌రికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్న‌ట్టే తెలుస్తోంది.రాబోయే కాలంలో ఇలాంటి మార్పు చాలా ముఖ్య‌మ‌ని అంద‌రూ చెబుతున్నారు.ఇక ప్ర‌తిప‌క్షాల‌కు కూడా ఖర్చు చేసే భారం త‌గ్గుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారంట‌.ఏదేమైనా జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని అంద‌రూ స్వాగ‌తిస్తున్నారు.

.

#Badvel #Badwell #AP Poltics #Jagan #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube