జగన్ మామూలోడు కాదు ... సొంత సర్వే టీమ్ లతో ' రాజకీయం ' ?

వైసీపీని ఏపీలో అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో జగన్ ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సొంత పార్టీ పెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు జగన్ ఎదుర్కొన్నారు.2014 లో అధికారం కోసం ఎంతగా ప్రయత్నాలు చేసినా టిడిపి విజయాన్ని దక్కించుకుంది.అయినా జగన్ ఎక్కడా కంగారు పడలేదు.

 Jagan Is Looking After His Own Survey Team In Ap Without Any Political Difficult-TeluguStop.com

పార్టీని బలోపేతం చేస్తూ,  జనాల్లో ఆదరణ ఏవిధంగా పెంచుకోవాలి అనే విషయంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.అనుకున్న వ్యూహాలను అనుకున్నట్టుగా అమలుచేసి 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి తీసుకు రాగలిగారు.

  ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి జనాల్లో సంతృప్తి కలిగేలా చేయగలిగారు.  ఇక వైసిపి వ్యూహాలతో ఏపీలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది.

జగన్ ఇచ్చిన హామీలు నే కాకుండా సొంతంగా ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేయడం ప్రజల సంతృప్తికి కారణమైంది.  అయితే ఆ పథకాలలోని చిన్న చిన్న లోపాలను సైతం ఎత్తి చూపిస్తూ,  వైసీపీని ఇరుకున పెట్టేందుకు,  జనాల్లో వ్యతిరేకత పెరిగేలా చేసేందుకు ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు.

 దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కి దక్కిన విజయమే  కారణం.జగన్ ను ఇటీవల కాలంలో చూస్తే,  జగన్ తాను అమలు చేస్తున్న పథకాలు,  నిర్ణయాల విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.జగన్ ఆషామాషీగా అయితే ఆ నిర్ణయం తీసుకోవడం లేదు.

జగన్ ఏ విషయంలోనూ,  ఎవరి మాట వినరు.సొంతంగా తాను ఏదైతే చేయాలనుకున్నారో అది చేసి చూపిస్తారు.

దీనికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ ను సైతం ఏర్పాటు చేసుకున్నారు.జగన్ సొంతంగా దాదాపు ఐదు సర్వే సంస్థలను ఏర్పాటు చేసుకున్నట్లుగా వైసీపీ లోని వర్గాలు చెబుతున్నాయి.

ఆ సర్వే సంస్థల ద్వారా ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతోంది.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరువ అవుతున్నాయి ఇలా అనేక విషయాలను ఆ సర్వేల ద్వారా తెలుసుకుంటూ…  ప్రజల్లో వ్యతిరేకత ఉన్న విషయాల్లో వెనక్కి తగ్గడం వంటి వ్యవహారాలు చేస్తున్నారట.

అయితే ఇంటెలిజెన్స్ సర్వేల్లో ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలు వచ్చినా ,  వాటిని జగన్ అసలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదట.
 

Telugu Ap, Chandrababu, Jagan, Jagan Sarve, Ysrcp-Telugu Political News

ఇక సొంత సర్వే ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని జగన్ గ్రహించారు.అందుకే వారందరికీ వార్నింగ్ ఇస్తూ,  పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారట.పనితీరు కనుక మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చేది లేదనే విషయాన్ని జగన్ హెచ్చరికల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే ప్రభుత్వ పనితీరుపై జనాల్లో పూర్తిగా సంతృప్తి ఉండదని, నిర్లక్ష్యం వహించవద్దు అని,  ప్రజల్లో మార్పు రావడానికి ఒక్క రోజు సమయం సరిపోతుదని,  కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చేయాలంటూ జగన్ ఎప్పటికప్పుడు మంత్రులు,  ఎమ్మెల్యేలకు వార్నింగులు ఇస్తున్నారట .మొత్తంగా చూస్తే జగన్ తన సొంత సర్వే టీమ్ లతో తన పరిపాలన ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకుంటూ,  ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ తన నిర్ణయాల్లో మార్పుచేర్పులు ఉండేలా చేసుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube