దసరా తరువాత ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన ?

పార్టీపైనా, ప్రభుత్వంపైనా అదేపనిగా విమర్శలు పెరిగిపోతుండడంతో, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం పెరిగినట్టుగా కనిపిస్తున్నా, నాయకుల వ్యవహార శైలి కారణంగా ఆ వచ్చిన క్రెడిట్ మొత్తం పోతుందనే అభిప్రాయం జగన్ లో ఎక్కువగా ఉంది.

 Jagan Is Going To Make Changes In The Ap Cabinet After Dasara  Ap Cm, Jagan, Ysr-TeluguStop.com

ముఖ్యంగా కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని, పదేపదే వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలు చేస్తున్నా, వారి వ్యవహార శైలిలో మార్పు రాకపోవడం, ఇలా ఎన్నో అంశాలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.జగన్ ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటూ, మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారాలపై సీరియస్ గా దృష్టి పెట్టలేకపోతున్నారు.

ఆయన పూర్తిగా ప్రభుత్వ పాలనలోనే తీరిక లేకుండా ఉండిపోతున్నారు.

ఈ కారణాలతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి తోడు మంత్రుల పనితీరు పై అధికారులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవడం, చాలా మంది మంత్రులు కార్యాలయాలకు హాజరుకాకపోవడం వంటి కారణాలతో ఎన్నో బిల్లులు , నిర్ణయాలు, పెండింగ్ లో పడడం, మరెన్నో అంశాలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.దీనిపై అధికారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోతుండటం, చీఫ్ సెక్రటరీ నీలం సహాని సైతం ఫిర్యాదు చేసే వరకు వ్యవహారాలు వెళ్తున్నాయట.

ఈ కారణాలతో, పనితీరు సక్రమంగా లేని మంత్రులను తప్పించాలనే ఆలోచనకు జగన్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల కొంతమంది మంత్రులు వివాదాస్పద అంశాల్లో జోక్యం చేసుకోవడం, ప్రతిపక్షాలతో విమర్శలను ఎదుర్కోవడం వంటి వ్యవహారాలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.

జగన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో, ఈ వ్యవహారాలపై సీరియస్ గా దృష్టి పెట్టలేకపోతున్నారు.దీని కారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది.

అనే రిపోర్టులు అందడంతో మంత్రులను కట్టడి చేసేందుకు దసరా తర్వాత పూర్తిగా మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube