కష్టమంతా వృథానే ! జగన్ కు తెలిసిన అసలు నిజమేంటి ?

పార్టీ నీ, ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ ఎంత కష్ట పడుతున్నారో, అంతే స్థాయిలో వెనక్కి లాగేందుకు  సొంత పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై చాలాకాలంగా జగన్ ఆగ్రహం లోనే ఉంటూ వస్తున్నారు.ఎప్పటికప్పుడు ఈ వ్యవహారాలను పరిష్కరించేందుకు పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించినా, ఫలితం పెద్దగా ఉండకపోవడం,   నియోజకవర్గాల్లో పూర్తిగా పార్టీ పరిస్థితి దిగజారడం, సొంత పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే క్రమంలో, సొంత పార్టీకి నష్టం చేకూరే విధంగా వ్యవహరించడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

 Jagan Is Going To Hold Constituency-wise Meetings To Resolve Differences Between-TeluguStop.com

ఇప్పటి వరకు ఈ వ్యవహారాలపై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన జగన్ పార్టీ పరిస్థితి మరింత గా దిగజారుతున్న తీరు కనిపిస్తూ ఉండడం , ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిపోతున్న క్రమంలో  పార్టీ ని ఒక గాడిలో పార్టీని పెట్టకపోతే ,  2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుంది అనే ఈ విషయాన్ని జగన్ గుర్తించారు.

ఇప్పటికే వివిధ విభాగాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం , తెలుగుదేశం పార్టీ క్రమంగా బలం పెంచుకుంటుంది.

అదే సమయంలో ప్రభుత్వ ప్రతిష్ట మరింతగా  దిగజారిపోతోంది అనే రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో, ఇక ఆలస్యం చేయకుండా నియోజకవర్గాల వారీగా కీలక నాయకులు అందరితోనూ సమావేశాలు నిర్వహించేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.నియోజకవర్గం లో వాస్తవ పరిస్థితులు ఏమిటి ? ఏ ఏ నాయకుల మధ్య ఏ విషయాల్లో విభేదాలు ఉన్నాయి ? ఏ విధంగా వీరి మధ్య గ్రూపు రాజకీయాలు లేకుండా చేసి సమిష్టిగా ముందుకు తీసుకు వెళ్ళగలము అనే అంశాలపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిపోర్టులను జగన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Constency, Jagan, Ysrcp-Political

ఈ సమావేశాల్లోనే నియోజకవర్గంపై నాయకుల అభిప్రాయాలను , అసంతృప్తులను అన్నిటినీ తెలుసుకుని, అక్కడికక్కడే జగన్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా వారికే చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ప్రభుత్వం వ్యవహారాలకు సంబంధించి జగన్ బిజీగా ఉంటూ వచ్చారు.ఆ విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెంచారు.కానీ గ్రూప్ రాజకీయాల కారణంగా జరిగే నష్టం కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందనే విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించారు.అందుకే ఇప్పుడు గ్రూపు వర్గ విభేదాలను పరిష్కరించి, సమిష్టిగా నాయకులందరూ ముందుకు వెళ్లే విధంగా జగన్ సరికొత్త ఎత్తుగడ తో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.జగన్ ఎంతవరకు ఈ విషయంలో సక్సెస్ అవుతారో, పార్టీ నాయకుల్లో మార్పు తీసుకువస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube