జగన్ బటన్ నొక్కి పేదల జేబులు ఖాళీ చేస్తున్నారు..: నారా లోకేశ్

చేనేత రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.

చేనేతలతో ఆత్మీయ సమావేశం అయిన లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాగే ఆర్థికంగా, రాజకీయంగా చేనేతలను మెరుగైన స్థితిలో నిలిపేందుకు కృషి చేస్తామని లోకేశ్ తెలిపారు.అందుకోసం తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ ను వేర్వేరుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.సీఎం జగన్ బటన్ నొక్కి పేదల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇప్పటికే ఏపీ అప్పులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేరాయని విమర్శించారు.అయితే పేదలను సొంత కాళ్లపై నిలబెట్టాలనేది చంద్రబాబు ఆలోచన అని స్పష్టం చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు