అప్పుడే మాట వినడం లేదా ? వారిపై జగన్ గుర్రుగా ఉన్నారా ?

కొత్తగా కొలువై ఉన్న ఏపీ మంత్రి మండలిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.జగన్ క్యాబినెట్ లో ఇప్పటి వరకు ఎవరూ ఊహించని వ్యక్తులు మంత్రిపదవులు దక్కించుకున్నారు.

 Jagan Hesitation On New Leader In The Party1-TeluguStop.com

జగన్ క్యాబినెట్ లో బెర్త్ ఖాయం అనుకున్న ఆయన నమ్మకస్థుల్లో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ జగన్ మంత్రులుగా అవకాశం కల్పించలేదు.అయితే ప్రస్తుత మంత్రుల మీద జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడట.

తాను చెప్పిన పనులు, సూచనలు పాటించడంలేదంటూ మండిపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.పాలనలో అంతగా అనుభవం లేకపోవడంతో సీఎం జగన్ సీనియర్ అధికారుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తున్నారు.

నెలరోజుల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా, మంత్రులు మాత్రం తన మాటల్ని లెక్కచేయడం లేదంటూ జగన్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

-Telugu Political News

తాను అనేక రకాలుగా వారికి అర్ధమయ్యేట్టు చెబుతున్నా ఎవరూ తన మాట లెక్కచేయడంలేదనే భావనలో జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.సీఎంగా బాధ్యతలు చేపట్టాక గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారెవరినీ పేషీల్లోకి తీసుకోవద్దంటూ సీఎం ఆదేశాలు జారీచేశారు.అయితే వాటిని మంత్రులు అంతగా పట్టించుకోకపోవడం జగన్ కోపానికి కారణమట.

పీఏ,పీఎస్,ఓఎస్డీ ల నియామకంలో సీఎం ఆదేశాలు పత్తిఞ్చగుకోకపోతే ఎలా అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా.తెలుగుదేశం ప్రభ్త్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని పేషీల్లో పెట్టుకున్నారు పలువురు మంత్రులు.

గతంలో ఆరోపణలు ఉన్న వారిని తమ వెనుక తిప్పుకుంటున్న మంత్రుల తీరు జగన్ కు అస్సలు నచ్చడంలేదట.

విద్యాశాఖ మంత్రి పీఎస్ పైనా గతంలో ఆరోపణలు వచ్చాయి.

కానీ ఆయన మళ్లీ కొనసాగుతున్నారు.షీల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి నిఘా నివేదికలు తెప్పించుకుంటున్న జగన్ రాబోయే రోజుల్లో మంత్రులకు క్లాస్ పీకడం ఖాయంగా కనిపిస్తోంది.

అంతేకాకుండా తన మాటను లెక్కచేయని వారిపై వేటు వేసేందుకు కూడా జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుత మంత్రివర్గ పదవీకాలం కేవలం రెండున్నర సంవత్సరాలే అని జగన్ అనేకమార్లు స్పష్టం చేశాడు.

అయితే ఈ రెండున్నర సంవత్సరాల్లో మనం ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా కొంతమంది మంత్రులు భావిస్తూ ఇలా వ్యవహరిస్తున్నట్టుగా జగన్ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube