గతాన్ని మరచి మళ్లీ వచ్చెయ్ జగన్!!!

దివంగత నేత వైఎస్ఆర్ దుర్మరణం తరువాత ముఖ్యమంత్రి పదవి దక్కని కారణంగా వైకాపా పేరుతో సొంత కుంపటి పెట్టుకుని ముక్కుతూ మూల్గుతూ కాలం గడిపేస్తున్నాడు జగన్.అయితే జగన్ మళ్లీ కొంగ్రెస్ లో చేరాల్సిన సమయం వచ్చింది అంటున్నాడు ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి.

 Jagan Has To Join Congress Again-TeluguStop.com

అయితే ఇదేదో జగన్ పై ప్రేమతోనో లేక వేరే ఆలోచనతోనో కాదు ప్రస్తుతం కొంగ్రెస్ పరిస్థితి మరింత అద్వానంగా ఉన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.ఆయన మాట్లాడుతూ.

మళ్లీ జగన్ కొంగ్రెస్ లోకి రావాలంటు తెలిపాడు.అంతేకాకుండా జగన్ తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్రలోని ఎన్సీపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడమో లేక కాంగ్రెస్ కూటమిలో చేరడమో చేయాలని సూచించారు.

వివిధ కారణాలతో గతంలో వీరంతా కాంగ్రెస్ కు దూరమయ్యారని… ప్రస్తుతం దానికి అంత ప్రాధాన్యత లేదని… గతాన్ని మర్చిపోయి వీరంతా కాంగ్రెస్ కు చేరువకావాలని విన్నవించారు.జనతా పరివార్ మాదిరి గతంలో కాంగ్రెస్ తో కలసి పనిచేసిన నేతలంతా ఒక్కటైతే… పార్లమెంటులో వంద మంది ఎంపీల సమూహం తయారవుతుందని జోగి తెలిపారు.

మరి జోగి మాటలు మన నేతల చెవుల్లో పడ్డాయో లేదో తెలీదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube