ఆ అధికారి విష‌యంలో జ‌గ‌న్ అనుకున్న‌ది సాధించారుగా..

Jagan Had Achieved What He Had Hoped For In The Case Of That Officer

ఏపీ రాజ‌కీయాల్లో కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్ ఈజీగానే స‌క్సెస్ సాధిస్తున్నారు.కేంద్రంతో సంబంధం ఉన్న అనేక విష‌యాల్లో జ‌గ‌న్ ఫెయిల్ అవుతున్నారు.

 Jagan Had Achieved What He Had Hoped For In The Case Of That Officer-TeluguStop.com

మూడు రాజ‌ధానుల బిల్లు విష‌యంలో, మండ‌లి ర‌ద్దు విష‌యంలో, ఎంపీ ర‌ఘురామ విష‌యంలో ఇలా అనేక విష‌యాల్లో ప్ర‌తిపాద‌న‌లు పంపినా పెద్ద‌గా ఫ‌లితాలు మాత్రం రాలేదు.అయితే ఇప్పుడు మాత్రం ఓ విష‌యంలో ఆయ‌న అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగానే జ‌రిగింది.

అది కూడా ఏదో విష‌యంలో అనుకోకండి.ఓ అధికారి విష‌యంలో.

 Jagan Had Achieved What He Had Hoped For In The Case Of That Officer-ఆ అధికారి విష‌యంలో జ‌గ‌న్ అనుకున్న‌ది సాధించారుగా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అస‌లు ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డా.సమీర్ శర్మ విష‌యంలోనే నండి.ఇప్ప‌టికే ఆయ‌న పదవీ కాలం ముగుస్తోంది.

దీంతో జ‌గ‌న్ అలెర్ట్ అయిపోయారు.ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అంటే మామూలు విష‌యం కాదు క‌దా.

జ‌గ‌న్ చేప‌ట్టే ప్ర‌తి ప‌ని ఆయ‌నకు బాగా తెలిసి ఉంటుంది.ఏ స్కీమ్ పెట్టినా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా ముంద‌స్తుగానే ఆయ‌న‌తో పూర్తిగా చ‌ర్చించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకుంటారు.

కాబ‌ట్టి మ‌ధ్య‌లో మారిస్తే త‌న‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని గ్ర‌హించిన జ‌గ‌న్ ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగింప చేసుకున్నారు.

Telugu Jagan, Jaganachieved-Telugu Political News

ఇక ఇందుకోసం జ‌గ‌న్ ఏకంగా కేంద్రానికి లేఖ రాయ‌గా.ఫ‌స్ట్ టైమ్ కేంద్రం కూడా జ‌గ‌న్ లేఖ‌మీద వెంట‌నే రియాక్టు అయింది.అది కూడా సానుకూలంగా రియాక్ట్ కావ‌డం ఇక్క‌డ విశేషం.

ఇక స‌మీర్ శ‌ర్మ కు మ‌రో ఆరు నెల‌ల పాటు అంటే మే 31 దాకా ప‌ద‌వీ కాలాన్ని పొడిగించింది కేంద్రం.దీంతో జగన్ మొద‌టిసారి అనుకున్న‌ది చాలా తొంద‌ర‌గా కేంద్రం నుంచి సాధించేశారు.

నిజానికి స‌మీర్ శ‌ర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తే ఆయ‌న ప్లేస్ లో జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారి వ‌స్తార‌ని అంతా ఊహించారు.కానీ జ‌గ‌న్ మాత్రం ఆయ‌న‌కే మొగ్గు చూప‌డం గ‌మ‌నార్హం.

.

#Jagan #JaganAchieved

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube