రాజు గారి దెబ్బ ... జగన్ కు డ్యామేజ్ ఎంతంటే ?

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టుకు ముందు నుంచి వైసీపీ పై అదేపనిగా విమర్శలు చేస్తూ, జగన్ ప్రభుత్వాన్ని ఎంతగా ఇబ్బందుల పాలు చేయాలో అంత ఆయన చేశారు.వైసీపీకి ప్రత్యర్థి పార్టీలు గా ఉన్న టిడిపి, జనసేన, బిజెపిల కంటే సొంత పార్టీ ఎంపీ రఘు రామ చేసిన విమర్శలే చికాకు తెప్పించాయి.

 Jagan Government Troubled On Mp Raghurama Krishnam Raju Issue, Ragurama Krishnam-TeluguStop.com

చివరకు రఘురామను అరెస్ట్ చేస్తే ఆయన వ్యవహారానికి చెక్ పెట్టినట్లు అవుతుందని మరెవరు ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సాహసించరు అని వైసీపీ ప్రభుత్వం భావించింది.

సిఐడి అధికారులు ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇక బెయిల్  బయటకు వచ్చిన కొద్ది రోజులపాటు సైలెంట్ గానే ఉన్నా , ఇక ఆ తర్వాత నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టే విధంగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు.తనకు జరిగిన అన్యాయం ఇది అంటూ దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరికీ ఆయన లేఖలు రాశారు.

అంతే కాదు మీ అందరి మద్దతు తనకు ఉండాలని, పార్లమెంట్ ఈ సమావేశాల్లో పార్టీలకతీతంగా తనకు మద్దతు ఇవ్వాలని రఘురామ అభ్యర్థించారు.తనమీద రాజద్రోహం కేసు కూడా పెట్టారు అని, తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ రఘురామ కృష్ణంరాజు లేఖలు రాయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

Telugu Jagan, Janasena, Modhi, Mps Ap Cid, Ysrcp-Telugu Political News

తన మీద దాడి చేసిన వారిపై సభా హక్కుల ఉల్లంఘన నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను రఘురామకృష్ణంరాజు కోరారు.అంతేకాదు ఈ వర్షాకాల సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన రామకృష్ణంరాజు జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వం పరువు తీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు.ఇప్పటికీ రఘురామ వైసీపీ ప్రభుత్వం వ్యవహారంపై జాతీయ మీడియాలో అనేక రకాల కథనాలు వస్తున్నాయి.ఒకవైపు ఏపీలో సంక్షేమ పథకాల అమలు తీరుతో జగన్ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా క్రెడిట్ వస్తున్న సమయంలోనే రఘురామ వ్యవహారంతో దేశవ్యాప్తంగా జగన్ ప్రభుత్వం పరువు పోతుంది.

ఈ వ్యవహారం జగన్ కు అతి పెద్ద సమస్యగా మారిపోయింది.రఘురామ కు బిజెపి పెద్దల అండదండలు ఉండడంతో ఈ విధంగా ఆయన హడావుడి చేయగలుగుతున్నారు అనే వ్యాఖ్యలు ఒకవైపు వినిపిస్తుండగా,  జగన్ ప్రభుత్వానికి బిజెపి కి మధ్య సఖ్యత ఉన్నా , చాలా విషయాల్లో బిజెపికి అండదండలు అందిస్తున్న  జగన్ ప్రభుత్వం పై కేంద్రం ఈ విధంగా వ్యవహరించడం ఎన్నో సందేహాలకు కారణం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube