ఏంటి నాని ఇది ! కొడాలితో జగన్ ఇక్కట్లు ?  

jagan facing problems with kodali nani, Jagan ,ysrcp,AP, kodali nani, TDP, Chandrababu,lokesh - Telugu Ap Government, Chandrababu, Devineni Uma, Gudivada, Jagan, Kodali Nani, Lokesh, Minister Kodali Nani, Tdp, Ysrcp

ఏపీ మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన ప్రసంగాలు, పంచ్ డైలాగులు ఓ రేంజిలో ప్రత్యర్థులను ఇరుకున పెడుతుంటాయి.

TeluguStop.com - Ap Cm Ys Jagan Facing Problems With Kodali Nani Comments

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను టార్గెట్ చేసుకుని నాని వదిలే పదునైన మాటల బాణాలు ఓ రేంజ్ లో ఉంటాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి నాని వ్యవహారశైలి ఇదేవిధంగా ఉంటూ వచ్చింది.

నాని మాట్లాడే అభ్యంతరకరమైన భాషను మొదట్లో వైసీపీ శ్రేణులతో పాటు, ప్రజలు కూడా బాగానే ఎంజాయ్ చేసే వారు.నాని ప్రసంగం అంటే టీవీ లకు అతుక్కుపోయే వారు.

TeluguStop.com - ఏంటి నాని ఇది కొడాలితో జగన్ ఇక్కట్లు -Political-Telugu Tollywood Photo Image

చంద్రబాబు ను లక్ష్యంగా చేసుకుని అరే ఒరే అన్నట్లుగా నాని మాట్లాడుతూ ఉండేవారు.అయితే రాను రాను నాని విమర్శలు శ్రుతి మించినట్లు కనిపిస్తున్నాయి.

కేవలం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే నానిని జగన్ సైతం ప్రోత్సహిస్తూ వస్తున్నారు.కానీ నాని ప్రసంగాలు చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శలు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారాయి అనే లెక్కలు బయటకు వస్తున్నాయి.

నాని ఉపయోగిస్తున్న భాష పై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.ఒక పక్క జగన్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేసుకుని అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.కులమత బేధాలు లేకుండా అందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే ఏకైక లక్ష్యంతో జగన్ ముందుకు వెళ్తున్నారు.కానీ నాని వంటి వారి దూకుడు ఇప్పుడు అదే జగన్ ప్రభుత్వానికి స్పీడ్ బ్రేకర్లు గా మారాయి అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు ప్రతివిమర్శలు అనేది సాధారణం.కాకపోతే అవి మరీ శృతిమించితే మొదటికే మోసం వస్తుంది అనేది ఇప్పుడు నాని విషయంలో నిజమయ్యేలా కనిపిస్తోంది.

జగన్ పై ఎవరు విమర్శలు చేసినా తాను ఊరుకోను, తన భాష ఇలాగే ఉంటుంది అన్నట్లుగా నాని వ్యవహరిస్తుండడం ఆయన దృష్టిలో కరెక్ట్ అయినా, జగన్ పై ఆయనకున్న అభిమానాన్ని ఈ విధంగా చూపించుకుంటున్నా, ప్రజల్లో మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం నాని మాట్లాడుతున్న భాషను వైసిపి శ్రేణులు ఎంజాయ్ చేస్తున్నా, జనాల్లో అది వ్యతిరేకతను కలిగించేలా కనిపిస్తోంది.ప్రస్తుతం నాని ని వైసీపీ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు.అదే నానికి చేటు తెచ్చే అవకాశం కనిపిస్తోంది.టిడిపి ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదేవిధమైన వ్యవహార శైలితో ఉండేవారు.టీడీపీపై ఈ తరహాలోనే వ్యవహరించేవారు.కానీ అటువంటి వారి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాం.

బాబు కమ్మ సామాజిక వర్గం కాబట్టే, అదే కమ్మ సామాజిక వర్గం కు చెందిన నాని ని అస్త్రంగా వైసిపి వాడుకుంటోందని, నాని కాకపోతే మరో కమ్మ నేతకు ఈ అవకాశం వచ్చి ఉండేదని, జగన్ కు వైసీపీ ప్రభుత్వానికి తాను రక్షణ కవచం గా ఉంటున్నానని నాని అభిప్రాయపడుతున్నారు.అదే ఇప్పుడు వైసిపి కి, జగన్ ఇమేజ్ కు డామేజ్ కలిగించేలా కనిపిస్తోంది.

#Kodali Nani #Chandrababu #Devineni Uma #Ysrcp #MinisterKodali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు