జగన్ ఎన్ని చేసినా వృధానే ? బాబుదే పై చేయి !

స్వతహాగా అధికార పార్టీ అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు క్యూ కట్టేస్తారు.ఎమ్మెల్యేలు కీలక నాయకులు ఇలా అంతా అధికార పార్టీ వైపే అడుగులు వేస్తూ ఉంటారు.

 Ys Jagan Government Troubled On Cbn Decisions,ys Jagan, Cbn Decision, Tdp Mlas,y-TeluguStop.com

ప్రభుత్వం మారిన ప్రతిసారి ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం.ఇక వైసీపీ విషయంలోనూ అదే విధంగా మొదట్లో జరిగినా, చేరికలకు జగన్ పెద్దగా మొగ్గు చూపించలేదు.

అలాగే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గానీ, మిగతా నాయకులు కానీ వైసీపీ లోకి రావాలంటే టీడీపీకి తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసి మాత్రమే వైసీపీలో చేరాలనే కండిషన్ పెట్టారు.దీంతో చేరికలకు బ్రేకులు పడ్డాయి.

కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీ లో చేరకుండానే, ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.ఇదిలా ఉంటే, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వస్తారని, టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దు అవుతుంది అని, జగన్ భావించారు.

కానీ అలా జరగలేదు.జరిగే అవకాశం కూడా కనిపించడం లేదు.
 కేవలం వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ మాత్రమే వై.సి.పి.కి అండగా నిలిచారు.వైసీపీ తరపున టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే వైసీపీ వైపు వచ్చారు.మరికొందరు ముందుకు వస్తేనే టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రద్దు అవుతుంది.

ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వీరంతా వైసీపీ వైపు వస్తారని జగన్ ఆశలు పెట్టుకోగా, వారు ముందుకు వచ్చేందుకు సంకేతాలు ఇచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు.దీంతో జగన్ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం టీడీపీ కాస్తో కూస్తో పుంజుకుంటున్నట్టు  కనిపిస్తున్న తరుణంలో వైసీపీ వైపు వచ్చేందుకు ముందు నుంచి వారు సిద్ధంగా ఉన్నా, వారంతా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.

Telugu Ap, Cbn, Tdp Mlas, Ys Jagan, Ysjagan-Political

దీంతో రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తున్న జగన్ దూకుడుకు బ్రేక్ పడినట్లుగానే కనిపిస్తోంది.ఇక ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవి అమలు కాకుండా,టీడీపీ నిర్ణయాల లోని లోపాలను ఎత్తి చూపిస్తూ, కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ, అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు.బాబు రాజకీయంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిదశలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube