ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది జగన్ ప్రభుత్వం.రాష్ట్రంలో కొత్తగా 1180 ఉద్యోగ ఖాళీలను భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

 Jagan Government Tells Good News To Unemployed In Ap , Andhra Pradesh,  Ys Jagan-TeluguStop.com

ఈ మేరకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.అంతేకాకుండా ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వార్షిక జాబ్ క్యాలెండర్ లో చేర్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అదే రీతిలో ఈ పోస్టులు అన్నిటికీ అగ్రవర్ణాల పేదలకు సంబంధించిన ఈ బీసీ రిజర్వేషన్ల నీ వర్తింపజేయాలని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి జగన్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది.రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లు సహా వేర్వేరు విభాగాల్లో మొత్తం కలిపి 1180 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.

ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు గతంలో వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో లక్షల్లో నోటిఫికేషన్ లో రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వేల సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం పట్ల విమర్శలు చేస్తున్నాయి.ఏపీలో నిరుద్యోగుల విషయంలో జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube