ప్రభుత్వ హాస్పిటల్స్ విషయంలో మరో అడుగు ముందుకేసిన జగన్ ప్రభుత్వం..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో విద్య ,వైద్య పరంగా అనేక సంచలన నిర్ణయాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.“నాడు నేడు” అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు. పాఠశాలల రూపురేఖలను మార్చటం ఇటీవల మనం చూశాం.స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం మాత్రమే కాక .తరగతి రూపురేఖలను మార్చటం జరిగింది.ఇక ఇదే రీతిలో హాస్పిటల్స్ రూపురేఖలు కూడా మారుస్తూ వస్తున్నారు.

 Jagan Government Make Availability Of Ct And Mri Scans In Government Hospitals-TeluguStop.com

దీనిలో భాగంగా మరో కీలక అడుగు వేసింది జగన్ ప్రభుత్వం.మేటర్ లోకి వెళితే ఇక నుండి ప్రభుత్వ హాస్పిటల్స్ లో సిటీ, ఎమ్ఆర్ఐ పరీక్షలు కూడా నిర్వహించేలా వాటి యంత్రాలను ప్రవేశపెట్టింది.

ముందుగా ఈ యంత్రాలను శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు అదేవిధంగా కడప ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.తాజాగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుండి ఓపెన్ చేయడం జరిగింది.

 Jagan Government Make Availability Of Ct And Mri Scans In Government Hospitals-ప్రభుత్వ హాస్పిటల్స్ విషయంలో మరో అడుగు ముందుకేసిన జగన్ ప్రభుత్వం..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.

ఇక కరోనా వైరస్ చికిత్స విషయంలో శానిటేషన్ వర్కర్ నుండి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అద్భుత రీతిలో పనిచేస్తుందని అభినందించారు.

దేశంలో చాలా రాష్ట్రాలలో మెట్రోపాలిటన్ సిటీలు సూపర్ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నాగాని అక్కడ లేని రికవరీ రేటు ఏపీలో ఉందని దానికి కారణం మీరే అని వైద్యులను అదేవిధంగా వర్కర్లను పొగిడారు జగన్.డెత్ రేట్ విషయంలో కంట్రీ లో అత్యుత్తమ స్థానంలో .తక్కువ మరణాలు సంభవిస్తున్నాయి రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉందని జగన్ కితాబిచ్చారు.

#Nellore #Srikakulam #YS Jagan #Kadapa #CtMri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు