గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని గతంలో హామీ ఇవ్వడం జరిగింది.

 Jagan Government Keeps Promise Given To Village And Ward Secretariat Employees , Pass The Department Test,probation Declaration , Ap Cm Jagan, Grama Ward Sachivalayam,village And Ward Secretariat Employees-TeluguStop.com

ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని తాజాగా జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయిన ప్రతివారికి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం అంతకుముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ మేరకు సీఎం జగన్ ఈరోజు అందుకు సంబంధించి జీవోపై సంతకం చేశారు.

 Jagan Government Keeps Promise Given To Village And Ward Secretariat Employees , Pass The Department Test,Probation Declaration , Ap CM Jagan, Grama Ward Sachivalayam,village And Ward Secretariat Employees -గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వం..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీఎం జగన్ ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పిఆర్సి ప్రకారం జీతాలు పెరిగినట్లు అయింది.

జూలై నెల నుండి.పెంచిన జీతాలు సచివాలయ ఉద్యోగులకి అందనున్నట్లు సమాచారం.

వాస్తవానికి గత ఏడాది.గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల సర్వీస్ పూర్తయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మూలంగా ప్రొబేషన్ డిక్లరేషన్ వాయిదా వేస్తూ రావడం జరిగింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగ సంఘాల ఆందోళన సమయంలో జూన్ నెలలో.గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube