పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రిలీజ్ వేడుక మొదలుకొని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.వైసీపీ మంత్రులు సన్నాసులు అని రిపబ్లిక్ డే రిలీజ్ వేడుకలో డైలాగులు వేసిన పవన్ మంగళగిరి లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో.

 Jagan Government Gives Unexpected Shock To Pawan-TeluguStop.com

వైసీపీని వచ్చేఎన్నికలలో ఓడిస్తాం, 151 సీట్లు ఉన్న వైసీపీ ని 15 సీట్లకు పరిమితం చేస్తాం, వైసీపీ నాయకులు మోకాళ్లపై కూర్చోబెడతా అంటూ తీవ్ర స్థాయిలో డైలాగులు వేయడం జరిగింది.

ఇటువంటి తరుణంలో అక్టోబర్ 2వ తారీఖునరాష్ట్రవ్యాప్తంగా శ్రమదానం అనే టైటిల్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు కార్యక్రమం చేయాలని పవన్ పిలుపునివ్వటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజీ బ్రిడ్జ్ పైన మరమ్మతుల కార్యక్రమం చేపట్టాలని పర్మిషన్.జరిగిన జనసేన పార్టీ శ్రేణులకు జగన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

కాటన్ బ్యారేజీ పై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంటలను పూడ్చితే బ్యారేజీకి నష్టమని ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేయడం జరిగింది.దీంతో దీనికి ప్రభుత్వం పర్మిషన్ అవసరమా అంటూ ఎవరు అడ్డుకున్నా గాని అక్టోబర్ 2వ తారీఖు శ్రమదానం కార్యక్రమం చేస్తామని జనసేన పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube