ఏపీలో కర్ఫ్యూను పొడిగించిన జగన్ ప్రభుత్వం..!!

ఈనెల 5వ తారీఖున నుండి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలు అవుతున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కేసులు పెరుగుతూ ఉండటంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 Jagan Government Extends Curfew In Ap Ys Jagan, Andhra Pradesh, Ap Curfew-TeluguStop.com

పరిస్థితులు ఇలా ఉండగా ఏపీలో పాజిటివిటి రేటు పెరుగుతూ ఉండటంతో పాటు మరోపక్క కరోనా కేసులు కంట్రోల్ కాని పరిస్థితి ఏర్పడటంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కరోనా సమీక్ష సమావేశంలో అధికారులతో భేటీ అయిన జగన్ మరో రెండు వారాలు పొడిగిస్తూఅనగా ఈ నెలాఖరు వరకు ఏపీలో కర్ఫ్యూ అమలవుతుందని పేర్కొన్నారు.

అంతమాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాజాగా అధికారులకు జగన్ గట్టిగా చెప్పినట్లు సమాచారం.ప్రస్తుతం కర్ఫ్యూలో అమలవుతున్న టైమింగ్స్ రాబోయే రోజుల్లో కూడా అమలు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్.మేటర్ ఏమిటంటే కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలని ఆదుకోవడానికి సరికొత్త ప్రణాళిక వేస్తూ .వారి పేరుమీద బ్యాంకుల్లో డబ్బులు జమ చేసి వచ్చే వడ్డీతో వారి భవిష్యత్తు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube