సీఎం జగన్ కి థ్యాంక్స్ చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి పెద్ద కొడుకు..!!

Jagan Government Big Help To Sirivennela Family

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖుల మరణాలు వరుసగా సంభవిస్తూ ఉండటంతో ఇండస్ట్రీలో విషాద వాతావరణం అలుముకుంది.గత ఏడాది బాలసుబ్రమణ్యం ఈ ఏడాది శివ శంకర్ మాస్టర్ ఆ తర్వాత కొద్ది రోజులకే సీతారామశాస్త్రి చనిపోవటంతో సినీ ప్రముఖులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Jagan Government Big Help To Sirivennela Family-TeluguStop.com

సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యంతో.నిన్ననే మరణించడం జరిగింది.

కిమ్స్ హాస్పిటల్ లో… చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.సీతారామ శాస్త్రి మరణం పట్ల టాలీవుడ్ టాప్ హీరోలతో పాటు ఇండస్ట్రీ లో అనేక మంది మరియు రాజకీయ ప్రముఖులు సెలబ్రిటీలు.

 Jagan Government Big Help To Sirivennela Family-సీఎం జగన్ కి థ్యాంక్స్ చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి పెద్ద కొడుకు....-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది.ఇండస్ట్రీలో చాలా మంది టాప్ హీరోలు సీతారామశాస్త్రి నివాళులర్పించారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా జగన్ ప్రభుత్వం సీతారామశాస్త్రి కుటుంబానికి బిగ్ హెల్ప్ చేసింది.

విషయంలోకి వెళితే సీతారామశాస్త్రి చికిత్సకు సంబంధించి హాస్పిటల్స్ బిల్లు మొత్తం ఏపీ ప్రభుత్వం చెల్లించింది.

అడ్వాన్స్ గా ఆసుపత్రికి చెల్లించిన డబ్బులు కూడా తిరిగి సీతారామశాస్త్రి కుటుంబానికి వచ్చేలా చొరవ తీసుకుంది.ఈ విషయాన్ని సీతారామశాస్త్రి కుటుంబం ప్రకటన ద్వారా తెలియజేసింది.తమ కుటుంబం కష్టకాలంలో ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది అని, ఎంతో ఊరట కలిగించేలా వెన్నుదన్నుగా ఉన్నారు ఇందుకుగాను ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి కృతజ్ఞతలు అని సిరివెన్నెల సీతారామశాస్త్రి పెద్దకుమారుడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి యోగేశ్వర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా, సిరివెన్నెల కుటుంబానికి ఏపీలో స్థలం కేటాయించడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం.

#Sirivennla #YS Jagan #Andra Pradesh #Music Directot #Yogeswar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube