మావోయిస్టుల దాడిలో అమరులైన ఏపీ జవాన్లకు భారీ ఎక్స్ గ్రేషియా ప్రకటించిన జగన్ ప్రభుత్వం..!!

చత్తీస్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 24 మంది జవాన్లు మరణించడం తెలిసిందే.ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ ఈ ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు.

Telugu Amith Shah, Chhattisgarh, Ys Jagan-Telugu Political News

దీంతో జరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని పేర్కొన్నారు.జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

అంతమాత్రమే కాకుండా రెండు కుటుంబాలకు 30 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, ప్రభుత్వపరంగా రాబోయే రోజుల్లో మరింతగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఆర్థిక సహాయాన్ని తక్షిణం బాధిత కుటుంబాలకు అందించి .వారికి బాసటగా నిలవాలని ప్రభుత్వ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.కాగా ఈ ఘటనలో 31 మంది జవాన్లు గాయపడటం జరిగింది.

ఈ క్రమంలో అమరులైన జవాన్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించడం జరిగింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube