డ్యామేజి కంట్రోల్... 40 ఆలయాల పునర్ నిర్మాణం

ఏపీలోని ఆలయాలపై వరస దాడుల నేపథ్యంలో జగన్ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆలయాలు పునర్ నిర్మాణం చేసి డ్యామేజి కంట్రోల్ చేయాలని భావిస్తుంది.

 Jagan Governament Re Construct 40 Temples In Ap State, Ap Revenue Minister Vella-TeluguStop.com

జగన్ ఈ నెల 8వ తేదీన 11 గంటల 1 నిమిషాలకు పలు దేవాలయాల పనులు ప్రారంభిస్తాడు.ఈ విషయాని ఏపీ దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 13 జిల్లాలో 40 ఆలయాలను పునర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అన్నాడు.చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడలో పుష్కర ఏర్పాట్లకోసం ఆలయాలను కూల్చిన వాటిని కూడా పునర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telugu Temples, Apvellampalli, Chandrababu, Dakshinamukha, Goshalakrishna, Jagan

గతంలో దెబ్బతిన ఆలయాలను కూడా ఈ లిస్ట్ లోకి చేర్చింది.ముందుగా విజయవాడలో 70 కోట్లతో దుర్గగుడి అభివృద్ది పనులకు జగన్ శంఖుస్థాపన చేయనున్నాడు.అలాగే దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, రాహుకేతువు ఆలయం, బొడ్డు బొమ్మ ఆలయం, గోశాల కృష్ణుడి ఆలయాలను పునర్ నిర్మాణం పనులు జరుగుతాయని వెల్లంపల్లి అన్నాడు.తాజాగా ఏపీలో జరుగుతున్న ఆలయాల దాడులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే ఈ నిర్ణయం తీసుకునట్లుగా తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube