ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!!

ముఖ్యమంత్రిగా జగన్ చాలావరకు అట్టడుగు స్థాయిలో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా అన్ని విధాల పైకి తీసుకు వచ్చే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇందుకుగాను సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎక్కడ కూడా భేదాలు చూపించకుండా.

 Jagan Governament Good News To Sc St Families, Ys Jagan,ysr Aarogya Sree, Amma V-TeluguStop.com

రాజకీయాలు చేయకుండా పార్టీలకతీతంగా పథకాలు అమలు చేస్తున్నట్లు చాలామంది చెబుతున్నారు.ముఖ్యంగా చదువు మరియు వైద్యం భారం పేదల కుటుంబాలపై పడకుండా.

ఆ రెండిటి విషయాలలో జగన్ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక ఇక అదే విధంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలను ఆదుకుంటూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే సమాజంలో వెనకబడ్డ కులాలగా ముద్రపడిన ఎస్సి, ఎస్టి కుటుంబాలలో తాజాగా వెలుగులు నింపేలా జగన్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.మేటర్ ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు జగజ్జీవన్ పథకం కింద ఉచిత విద్యుత్ అందించడానికి రెడీ అయింది.

ఈ క్రమంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుకు ప్రభుత్వమే చెల్లింపు చేసే రీతిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22.44 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.దీంతో జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube