ఇదే కదా జగన్ మార్క్ ట్రీట్మెంట్ అంటే ?

పార్టీ అయినా ప్రభుత్వం అయినా తన మాటే చెల్లుబాటు కావలి తప్ప తనకు వారి పరిధికి మించి సలహాలు ఇవ్వాలని చూసినా, తన మాటను ధిక్కరించే ప్రయత్నం చేసినా వారికి తన మార్క్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో రుచి చూపించడంలో జగన్ బాగా పరిణితి చూపిస్తున్నారు.జగన్ కు స్వతహాగా కోపం ఎక్కువన్న సంగతి ఆ పార్టీలో మొదటి నుంచి జగన్ ను నమ్ముకున్న నాయకులు అందరికి బాగా తెలుసు.

 Jagan Go To The Rajashekar Reddy Way In Ap Rulling-TeluguStop.com

అప్పుడూ ఇప్పుడు కూడా తన మాటే ఫైనల్ అన్నట్టుగా జగన్ భావిస్తూ ఉంటారు.సీనియర్ల పేరుతో తనకు సలహాలు ఇచ్చేందుకు ఎవరు ప్రయత్నం చేసినా, పెత్తనం చేయాలని ప్రయత్నం చేసినా జగన్ ఆలస్యం చేయడమే లేదు.

వారికి గట్టి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు.ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో ఉన్న కొంత మంది నాయకులు అప్పట్లో ఆయన తండ్రి వైఎస్‌తో కలిసి పని చేశారు.

వైఎస్ తో వారి మాటలకు విలువ ఇస్తూ వారిని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించేవారు.

Telugu Apcm, Jagan, Jaganrajashekar, Jagananam-Telugu Political News

వైఎస్ చేసిన రాజకీయం వేరు.కానీ జగన్ దగ్గరకు వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు.సీనియర్లు కేబినెట్ సమావేశాల్లో కూడా నోరెత్తే సాహసం చేయడంలేదు.

ఇటువంటి పరిస్థితులు జగన్ కావాలనే కల్పిస్తున్నారు.అసలు ప్రభుత్వం అంటే జగన్ మాత్రమే కాదు కదా.జగన్ తో పాటుగా చాలా మంది ఉంటారు.కేబినెట్ ఉంటుంది.

అందులో సీనియర్ మంత్రులు ఉంటారు.కానీ.

వారెవరికీ ఇప్పుడు ప్రాధాన్యం లేదు.అంతా తానై జగన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అందులో ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రిని ఉద్దేశించి ఆనం విమర్శలు చేయడంతో జగన్ ఆయనకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Apcm, Jagan, Jaganrajashekar, Jagananam-Telugu Political News

వైసీపీలో స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పినా తాను సహించను అనేలా ఆనంకు జగన్ ఇచ్చిన వార్ణింగ్ గట్టిగా పనిచేసింది.అసలు ఆనం వైఎస్సార్ కు వీర విధేయుడిగా పేరు ఉంది.వైఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా కూడా పని చేశారు.అయినా ధిక్కార స్వరం వినిపిస్తే తన తండ్రిలా ఊరుకోననే విధంగా జగన్ వ్యవహరిస్తూ వన్ మ్యాన్ ఆర్మీలా పార్టీని నడిపిస్తున్నట్టుగా అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube