పార్టీ మారాలనుకునే తెలుగు తమ్ముళ్ళకి జగన్ స్ట్రోక్! అందుకే సైలెంట్  

Jagan Gives Master Stroke To Tdp Mla Candidates-bjp,jagan Gives Master Stroke,janasena Party,tdp Mla Candidates,ysrcp

తెలుగు దేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికారం కోసం చూస్తున్నారు. టీడీపీతో ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్ధం కాని అందరూ ఇప్పుడు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. జగన్ తెలుగు తమ్ముళ్ళకి పూర్తిగా గేట్లు మూసేసాడు. ఇక జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి..

పార్టీ మారాలనుకునే తెలుగు తమ్ముళ్ళకి జగన్ స్ట్రోక్! అందుకే సైలెంట్-Jagan Gives Master Stroke To TDP MLA Candidates

ఇక ప్రత్యామ్నాయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో ఈ ఐదేళ్ళు కాలం గడిపితే తరువాత ఉన్న అవకాశాన్ని బట్టి మళ్ళీ టీడీపీలోకి రావడమో, లేదంటే బీజేపీ తరుపున పోటీ చేయడమో చేయొచ్చని ఆ పార్టీ గూటికి చేరడానికి సిద్ధం అవుతున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా వీళ్ళకి ఎర్ర తివాచీ పరిచి మరి ఆహ్వానం పలుకుతున్నారు.

రేపో మారో ఇక బీజేపీలో చేరిపోవడానికి రెడీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలకి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నుంచి ఊహించని షాక్ తగిలింది.

ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మారాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలా కాకుండా పార్టీ మారుతం అంటే అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేనికి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో టీడీపీ నుంచి ఇప్పుడు ఉన్నపళంగా బీజేపీలోకి చేరితే కచ్చితంగా రాజీనామా చేసే వెళ్ళాలి.

లేదంటే అనర్హత వేటు పడి ఎమ్మెల్యే పదవి ఊడుతుంది. ఎ విధంగా చూసుకున్న ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళకి ఇది సందిగ్ధ పరిస్థితి. కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినా వీళ్ళు మళ్ళీ పార్టీ మారి ప్రజలలోకి వెళ్ళాలంటే గెలుపు ఆశలు వదులుకోవాల్సిందే.

ఈ నేపధ్యంలో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతున్నట్లు రాజకీయ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.