టీడీపీ అంతమే జగన్ పంతమా ? 

తెలుగుదేశం పార్టీ ని ఎన్ని రకాలుగా దెబ్బ తీయవచ్చొ,  అన్ని రకాలుగానూ దెబ్బతీస్తూ,  తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు అందరూ అరెస్టుల భయంతో అల్లాడుతున్నారు.

 Ap Cm Ys Jagan Targets Tdp Leaders, Tdp Leaders, Cm Ys Jagan, Ap Politics, Ycp,-TeluguStop.com

అయితే ఈ అరెస్టులు అవ్వడం, జైలుకు వెళ్లడం వంటివి తమకు ఎక్కడలేని సింపతీ తీసుకొస్తాయని తెలుగుదేశం పార్టీ కి కలిసి వస్తాయని టీడీపీ భావిస్తోంది.అందుకే పెద్దగా హడావుడి అయితే చేయడం లేదు.

కాకపోతే జగన్ మాత్రం టిడిపికి సింపతీ దక్కకుండా సదరు నాయకుల అవినీతి వ్యవహారాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే కాకుండా ,టీడీపీ ప్రభుత్వంలో సదరు నాయకులు చేసిన అవినీతి వ్యవహారాలు బయట పెడుతూ,  వారు అవినీతి పరులు అనే విషయాన్ని రుజువు చేస్తూ, ప్రజలలోను ఆ విషయాన్ని బలంగా నాటుకుపోయేలా చేస్తున్నారు.టీడీపీ నాయకులు ఈ విధంగా చేయడం ద్వారా,  టీడీపీని బలహీనం చేయవచ్చని ,ఇక ఆ పార్టీలో ఎవరు యాక్టివ్ గా ఉన్నా ఇదే పరిస్థితి వస్తుంది అనే పరిస్థితి కల్పిస్తే,  రానున్న రోజుల్లో టీడీపీ మరింత కష్టాల్లోకి వెళ్ళిపోతుంది అని, ఎలాగూ చంద్రబాబు ప్రభావం రానున్న రోజుల్లో పెద్దగా కనిపించదు అని, లోకేష్ కు సరైన రాజకీయ అనుభవం లేకపోవడం, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని జగన్ అభిప్రాయపడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.

Telugu Achhennaidu, Apcm, Ap, Chandrababu, Cm Ys Jagan, Devineni Uma, Jagan, Kol

 అందుకే కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలోనూ టీడీపీ నేతలే టార్గెట్ గా అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఆ పార్టీ కీలక నాయకుల వ్యవహారాలపై విచారణ జరుగుతూ, అనేక అవినీతి కేసులను బయటకు తీస్తూ, జైలుపాలు చేయడం, వారి అక్రమ ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.టీడీపీలో బలమైన నాయకులు చాలామంది ఉన్నారు.క్షేత్రస్థాయిలో వారికి గట్టి పట్టు ఉంది.వారి నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు.జగన్ కు జనాల్లో  పరపతిని తగ్గించడం ద్వారా,  రాబోయే రోజుల్లో తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు అనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు గా కనిపిస్తున్నారు.
కాకపోతే జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్లు గానే కనిపిస్తున్నా, కక్ష సాధింపు ధోరణికి ప్రభుత్వం దిగుతోందనే అభిప్రాయము జనాల్లోకి వెళ్తోంది.అయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

టీడీపీ ప్రభావాన్ని పూర్తిగా ఏపీ లో తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు గానే కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube