క‌మ్యూనిస్టుల మీద ప‌డ్డ జ‌గ‌న్‌.. అలెర్ట్ అయ్యాడా..?

ప్రత్యేక సిద్ధాతంతో పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డే వామ‌ప‌క్షాలను విమ‌ర్శించ‌డానికి ఎవ‌రూ పూనుకోరు.వామ‌ప‌క్షాల‌కు వారి యూనియ‌న్లే బ‌లం.

 Jagan Fell On The Communists Is His Alert , Jagan, Ycp-TeluguStop.com

రాజ‌కీయాల్లోనూ వారిదే పైచేయి ఉంటుంది.ఉపాధ్యాయ సంఘాల‌తోపాటు ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్ అన్నీ వామ‌ప‌క్ష అనుబంధ సంఘాలే.

ప్ర‌స్తుతం ఈ సంఘాలు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌త‌రేక గళాన్ని వినిపిస్తున్నాయి.రివ‌ర్స్ పీఆర్‌సీ అంటూ అమీతుమీ తేల్చుకుంటామ‌ని పేర్కొంటున్నాయి.

దీంతో ఎన్న‌డూలేనివిధంగా సీఎం జ‌గ‌న్  వామ‌ప‌క్షాల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.పీఆర్‌సీ సాధ‌న క‌మిటీ స‌మావేశంలో అన్ని ఒప్పందాలు ఒప్పుకుని, సంత‌కాలు చేశార‌ని, మ‌ళ్లీ బ‌య‌ట‌కు వెళ్లి ఆందోళ‌న‌లు చేయ‌డం స‌రికాద‌ని నిల‌దీయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

వామ‌ప‌క్షాలు అమ‌రావ‌తి అజెండాను మోస్తున్నాయంటూ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు.పేద‌ల‌కు ఇండ్ల స్థ‌లాలు ఇస్తామంటే మోకాల‌డ్డి కోర్టుకు వెళ్లిన చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా వామ‌ప‌క్షాలు పచ్చ ఎజెండా మోస్తున్నాయంటూ నిప్పులు చెర‌గ‌డం గ‌మ‌నార్హం.ప్ర‌భుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే యేటా రూ.3500 కోట్లు ఖ‌ర్చ‌వుతుంటే  క‌నిపించ‌డం లేదా అంటూ నిల‌దీయ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

రెండున్నరేండ్ల‌లో త‌మ ప్ర‌భుత్వం అవుట్ సోర్సింగ్‌కు కార్పొరేష‌న్ పెట్టామ‌ని, ఆశావ‌ర్క‌ర్లు, హోమ్‌గార్డులు, త‌దిత‌ర ఉద్యోగులుకు జీతాలు పెంచిన‌వి వామ‌ప‌క్షాల‌కు క‌న‌బ‌డటం లేదా అని నిల‌దీశారు.త‌మ ప్ర‌భుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు టీడీపీ య‌త్నిస్తున్న‌ద‌ని, అదే ప‌చ్చ అజెండాను వామ‌ప‌క్షాల మ‌ద్ద‌తు క‌లిగిన యూనియ‌న్లు మోస్తున్నయంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఒమిక్రాన్ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు లేకుండా చేయ‌డానికే ఉపాధ్యాయుల‌తో ఆందోళ‌నలు చేయిస్తున్నారని అన్నారు.ఇది స‌రికాద‌ని, తాము ప్ర‌జ‌ల‌కు ఇంకా చేయాల‌నే ఆలోచ‌న‌లోనే ఉన్నామ‌ని, వామ‌ప‌క్షాలు ప‌చ్చ ఎజెండా మోయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించ‌డం చ‌ర్ఛ‌ణీయాంశంగా మారింది.

ఈ కామెంట్ల ప‌ట్ల ఎర్ర‌న్న‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మొత్తానికి జ‌గ‌న్ అలెర్ట్ అయిపోయిన‌ట్టే క‌నిపిస్తుంది.ఎందుకంటే చంద్ర‌బాబు ప్లాన్ పెద్ద‌దై త‌న‌కు ఇబ్బంది కాక ముందే ఇలా విడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న మాట‌.

Jagan Fell On The Communists Is His Alert , Jagan, Ycp - Telugu Jagan, Jagan Fell

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube