జనసేనానిపై వైసీపీ విమర్శలు! బెడిసి కొడుతున్న వ్యూహం

ఏపీలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి.ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన విస్తృత పర్యటనలతో ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

 Jagan Facing Troubles With Janasena In Poll Campaign-TeluguStop.com

ఎవరికి వారు తమ రాజకీయ వ్యూహాలతో ఎన్నికల పోరులో విమర్శలు, ప్రతి విమర్శలతో దూసుకుపోతున్నారు.ఇక ఈ పొలిటికల్ గేమ్ లో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.

వైసీపీ అధినేత జగన్ అధికార పార్టీ టీడీపీని కాకుండా ఎక్కువగా జనసేనాని మీద విమర్శలు చేస్తున్నారు.

జనసేన టీడీపీ బీ టీం అని, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని, అతనికి ప్యాకేజీ గట్టిగా ముట్టింది అంటూ విమర్శలు చేస్తూన్నారు.

అలాగే టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని, అందుకే టీడీపీ అభ్యర్ధుల మీద బలమైన వారిని నిలబెట్టకుండా జనసేన తప్పించుకుందని విమర్శలు చేస్తున్నారు.ఇక జేడీ లక్ష్మినారాయణ వచ్చిన తర్వాత వైసీపీ విమర్శల జోరు పెంచి తమ పార్టీ అనుబంధ పత్రికలో కూడా జనసేన మీద ప్రధాన శీర్షికలో వార్తలు ప్రచురిస్తున్నారు.

అయితే జనసేనని, పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకొని ఎవరు విమర్శలు చేసిన అవి పవన్ కళ్యాణ్ కి మరింత బలంగా మారాయి.గతంలో జరిగిన అనుభవాలు కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ప్రజా పోరాటంలోకి వచ్చి ప్రజల మధ్య తనని తను నాయకుడుగా నిరూపించుకునే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ పై ఇలా ముప్పేట దాడి చేయడంలో కొన్ని వర్గాల వారికి అస్సలు రుచించడం లేదు.గతంలో ప్రజారాజ్యం పార్టీని కూడా ఇలాగే నిర్వీర్యం చేసారనే అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్ళింది.

ఇప్పుడు జనసేన పార్టీని కూడా అలా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందని ప్రజలు గ్రహిస్తున్నారు.ఇక జనసేనపై అదే పనిగా విమర్శలు చేయడం వైసీపీ ఓటమికి కారణం అవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.మరి దీనిపై జగన్ తన వ్యూహం మార్చుకుంటాడా లేక అదే పంథాలో అతి విశ్వాసంతో వెళ్తాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube